TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు
TGSRTC Recruitment : త్వరలోనే 3వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ పూర్తి వివరాలు
TGSRTC Notification : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. టీజీఎస్ ఆర్టీసీలో త్వరలో 3,035 ఉద్యోగాల నియామకాలు చేపడతామని ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి కరీంనగర్‌లో 33 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తం 500 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంలో కాంగ్రెస్ పార్టీకి ఘనత అందించినట్టు పేర్కొన్నారు. టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు 92 కోట్ల ఉచిత మహిళా టికెట్లు జారీ అయ్యాయని, మహిళల ప్రయాణానికి రూ. 3,200 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. బతుకమ్మ, దసరాకు అదనపు బస్సులు నడిపించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
కరీంనగర్‌లో విడుదల చేసిన 33 ఎలక్ట్రిక్ బస్సుల్లో 41 సీట్లు ఉన్నాయి, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవని పేర్కొన్నారు. ఈ బస్సుల్లో 2-3 గంటలలో పూర్తి ఛార్జింగ్ అవుతుందని, సెక్యూరిటీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు.
రాష్ట్రంలో 3035 ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులలో 2000 డ్రైవర్‌లు, 743 శ్రామికులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌లు (మెకానిక్), 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌లు (ట్రాఫిక్), 25 డిపో మేనేజర్‌లు, 23 అసిస్టెంట్ ఇంజనీర్‌లు (సివిల్), 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్‌లు, 11 సెక్షన్ ఆఫీసర్‌లు (సివిల్), 7 మెడికల్ ఆఫీసర్‌లు (జనరల్) మరియు 7 మెడికల్ ఆఫీసర్‌లు (స్పెషాలిస్ట్) ఉన్నారు.