Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ లో సూపర్ నోటిఫికేషన్ విడుదల | South Central Railway Sports Quota job recruitment apply online now | latest railway jobs in Telugu
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వే డిపార్ట్మెంట్ లో సూపర్ నోటిఫికేషన్ విడుదల | South Central Railway Sports Quota job recruitment apply online now | latest railway jobs in Telugu
South Central Railway Sports Quota job Notification :
నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి 03 ఫిబ్రవరి 2025 తేదీ వరకు అయితే చివరి తేదీ. ఒక సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ జాబ్ వస్తుంది.
సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద స్పోర్ట్స్ కోటాలో ఖాళీల భర్తీ జరగనుంది. క్రీడల్లో ప్రతిభ గల అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. మొత్తం 61 పోస్టులను భర్తీ చేయాలని ప్రణాళిక చేశారు. ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్నవారికి ఉపయోగపడుతుంది. దయచేసి పూర్తి వివరాలు జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేయండి.
ఆర్గనైజేషన్ వివరాలు
• ఆర్గనైజేషన్ పేరు: దక్షిణ మధ్య రైల్వే
• ముఖ్య కేంద్రం: సికింద్రాబాద్
• పోస్టులు భర్తీ విధానం: స్పోర్ట్స్ కోటా
• మొత్తం ఖాళీలు: 61
విద్యా అర్హతలు
లెవల్ 1 పోస్టుకు పదోతరగతి లేదా ఐటీఐ
రాష్ట్ర/జాతీయ స్థాయి క్రీడల్లో సర్టిఫికెట్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
లెవల్ 3/2 పోస్టుకు ఇంటర్ ఉత్తీర్ణత
సంబంధిత క్రీడాంశాల్లో గుర్తింపు పొందిన సర్టిఫికెట్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి తేదీ గడువు: 2025, జనవరి 1 నాటికి
• కనిష్ట వయసు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయసు: 25 సంవత్సరాలు
దరఖాస్తు చేయడానికి కింది డాక్యుమెంట్లు అవసరం:
• విద్యార్హతల ధృవపత్రం (పదోతరగతి/ఇంటర్/ఐటీఐ సర్టిఫికెట్)
• క్రీడలో ప్రావీణ్యం నిరూపించే సర్టిఫికెట్స్
• పాస్‌పోర్ట్ సైజు ఫోటో
• ఓఆర్ (ఆధార్/పాన్) కార్డు
• సంతకం స్కాన్ కాపీ
దరఖాస్తు విధానం
• ఆన్‌లైన్ వెబ్‌సైట్ https://scr.indianrailways.gov.inకి వెళ్లండి. స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, లాగిన్ అవ్వండి.
ఫీజు చెల్లింపు: దరఖాస్తు ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తు ప్రారంభం: జనవరి 4, 2025
• దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2025
ఈ నోటిఫికేషన్ గురించి మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ Pdf & అధికారిక వెబ్‌సైట్ చూడండి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here