apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana JobsWork From Home Jobs

తెలంగాణా సిటీ పోలీస్ స్టేషన్ లో SPO ఉద్యోగాలు విడుదల | Telangana City Police Station SPO Notification 2025 | Gk 15 Telugu

తెలంగాణా సిటీ పోలీస్ స్టేషన్ లో SPO ఉద్యోగాలు విడుదల | Telangana City Police Station SPO Notification 2025 | Gk 15 Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana City Police Station SPO  Jobs : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీస్ లో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (SPO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 191 పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు మాజీ సైనికులు, మాజీ పారా మిలిటరీ సిబ్బంది, రిటైర్డ్ పోలీస్ సిబ్బంది దరఖాస్తు చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ లో కానీ మీరు రిలేటివ్స్  లో కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి.

అర్హతలు:

• అభ్యర్థి తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడై ఉండాలి.
• జనవరి 1, 2025 నాటికి వయస్సు 58 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి.
• రిటైర్డ్ పోలీస్ సిబ్బంది రెండు సంవత్సరాల లోపు పదవీ విరమణ చేసి ఉండాలి.
• గరిష్ఠ వయస్సు పరిమితి 61 సంవత్సరాలు.

జీతం:

• ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹24,000 గౌరవ వేతనం చెల్లించబడుతుంది.
• సెలవుల సౌకర్యం లేదు.

అప్లికేషన్ ప్రక్రియ:

• ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఒరిజినల్ మరియు జిరాక్స్ పత్రాలతో కలిసి సబ్‌మిట్ చేయాలి.
• దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ జనవరి 25, 2025 సాయంత్రం 5 గంటల వరకు.

అవసరమైన పత్రాలు:

• ఎక్స్ సర్వీస్‌మెన్ డిశ్చార్జి బుక్ లేదా సి.ఏ.పి.పి. డిశ్చార్జ్ సర్టిఫికేట్.
• ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు.
• టెక్నికల్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్.
• డ్రైవింగ్ లైసెన్స్ (డ్రైవర్ పోస్టులకు).
• 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.

దరఖాస్తు సమర్పణ స్థలం:
• Spos ఆఫీస్, CAR హెడ్‌క్వార్టర్స్, పెట్లబుర్జ్, హైదరాబాద్.

ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే అభ్యర్థులు తమ పత్రాలను సక్రమంగా సిద్ధం చేసుకుని, సమయానికి దరఖాస్తు సమర్పించాలి. ఇది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం. అర్హతలున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!