New Ration Card : కొత్త రేషన్ కార్డు పై ప్రభుత్వం కీలక ప్రకటన
New Ration Card : కొత్త రేషన్ కార్డు పై ప్రభుత్వం కీలక ప్రకటన
New Ration Card : కొత్త రేషన్ కార్డు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కీలక ప్రకటన చేశారు.
కొత్త రేషన్ కార్డు జనవరి 26వ తేదీన అందజేస్తామని మంత్రి గారు ప్రభాకర్ గారు ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణలో రెండు కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికీ 90 లక్షల కొత్త రేషన్ కార్డు ఉన్నాయని తెలిపారు.
కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలు:
1. కుల గణన (SEEEPC) సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా జిల్లా కలెక్టర్లకు/ GHMC కమిషనర్ కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపబడును.
2. మండల స్థాయిలో ఎంపిడిఓ/ ULBలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు.
3. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) / DCSO పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు.
4. ముసాయిదా జాబితాను గ్రామసభ మరియు వార్డు సభ లో ప్రదర్శించి, చదివి వినిపించి, చర్చించిన తరువాత ఆమోదిస్తారు.
5. గ్రామసభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల / మున్సిపల్ స్థాయి లో ఇచ్చిన లాగిన్ లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ /GHMC కమీషనర్ లాగిన్ కు పంపాలి.
6. ఆ విధంగా పంపిన జాబితాను జిల్లా కలెక్టర్/ GHMC కమిషనర్ పరిశీలించి సంతృప్తి చెందితే కమిషనర్(CCS) లాగిన్ కి పంపాలి.
7. ఇట్టి ఫైనల్ లిస్ట్ ప్రకారం, CCS కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తారు.
8. అర్హత కలిగిన వ్యక్తి ఒకే ఒక్క ఆహార భద్రత (రేషన్) కార్డులొ ఉండేలా చర్యలు తీసుకోవాలి.
9. ఆహార భద్రత (రేషన్) కార్డులలొ సభ్యుల చేర్పులు మరియు తొలగింపులు చేయాలి.
10. కొత్త ఆహార భద్రత కార్డుల జారీకై, క్షేత్రస్థాయి పరిశీలనకు నమూనా అనుబంధం -1 చూపనైనది.
నిర్దేశము 4 లో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, జిల్లా కలెక్టర్లు / GHMC కమిషనర్ పైన పేర్కొన్న సూచనలను పాటించాలని కోరనైనది, తద్వారా అర్హత ఉన్న కుటుంబాలు తేది :26.1.2025 నుండి కొత్త ఆహార భద్రత (రేషన్) కార్డులను పొందుతారు.