Indirammaindlu | ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే మంజూరు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అధికారికంగా ప్రకటన
Indirammaindlu | ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే మంజూరు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ అధికారికంగా ప్రకటన
Indirammaindlu : ఇందిరమ్మ ఇళ్లు అర్హులకే మంజూరు చేయాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్తో హైదరాబాద్ నుంచి హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల స్వీకరణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఎల్ 1 నివేదికలో సొంత ఇంటి ఖాళీ స్థలం ఉన్న లబ్దిదారుల పేర్లు నమోదు చేయాలని చెప్పారు. ఎల్2 నివేదికలో సొంత ఇంటి స్థలం లేని లబ్దిదారుల పేర్లు నమోదు చేయాలన్నారు. అలాగే, ఎల్ 3 నివేదికలో అర్హులు కానివారి వివరాలు నమోదు చేయాలన్నారు.
![](https://gk15telugu.com/wp-content/uploads/2025/02/IMG-20250206-WA0043-1024x576.jpg)
జిల్లాలో మండలానికి ఓ గ్రామం చొప్పున ఎంపిక చేసిన దరఖాస్తుదారుల్లో అర్హులైన వారు ఎల్ 3 నివేదికలో ఉన్నట్లయితే.. వారిని ఎల్ 1 నివేదికలోకి మార్చాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. అనర్హులకు ఇళ్లు మంజూరు చేస్తే అధికారులే బాధ్యులవుతారని హైచ్చరించారు.
ఇందిరమ్మ ఇళ్లు 600 స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ కాకుండా, 400 స్క్వేర్ ఫీట్ కన్నా తక్కువ కాకుండా ఇళ్లు నిర్మించాలన్నారు. అంగన్వాడీ, ఆశా వంటి ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులేనని తెలిపారు. గతంలో మంజూరైన ఇండ్లు ప్రస్తుతం పక్కాగా నిర్మించుకునేందుకు, మరమ్మతులు చేపట్టేందుకు, ఇంటిపై మరో ఇళ్లు నిర్మించుకునేందుకు ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ ఆర్థిక సహాయం మంజూరు చేయొద్దన్నారు. అనంతరం అదనపు పింకేశ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం 1.43 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు.
![](https://gk15telugu.com/wp-content/uploads/2025/02/IMG-20250206-WA0043-1024x576.jpg)
ఈ వీడియో కాన్ఫరెన్లో హౌసింగ్ పీడీ మాతృ నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈలు భజరంగ్ లాల్, సాయిరామ్ రెడ్డి, చంద్రశేఖర్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.