apssdc jobsAndhra Pradesh jobsbank jobsCentral Government JobsDefence JobsGovernment JobsResultsTelangana Jobs

Central Government Job 2025 : కేవలం పదో తరగతి అర్హతతో నెల జీతం రూ.38,483 ఇస్తారు

Central Government Job 2025 : కేవలం పదో తరగతి అర్హతతో నెల జీతం రూ.38,483ఇస్తారు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR IGIB Driver Job Notification 2025 : CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (IGIB) లో డ్రైవర్ (నాన్-టెక్నికల్) పోస్టుల కోసం ఆంధ్ర తెలంగాణ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్చి 15, 2025న ఈ ప్రకటన వెలువడింది. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. కేవలం పదో తరగతి అర్హత అప్లై చేసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. వేతన శ్రేణి రూ.19,900 నుండి రూ.63,200 వరకు ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు 7 ఏప్రిల్ 2025 సాయంత్రం 8:00 గంటలలోపు https://www.igib.res.in/ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:

డ్రైవర్ (నాన్-టెక్నికల్) పోస్టులకు మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి:
• సాధారణ వర్గం (UR): 1
• ఇతర వెనుకబడిన వర్గం (OBC): 1
• షెడ్యూల్డ్ కులం (SC): 1

వేతన వివరాలు:

ఈ పోస్టుకు వేతన శ్రేణి రూ.19,900 నుండి రూ.63,200 (పే మెట్రిక్స్ లెవల్-02) ఉంటుంది. ఇది హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) సహా సుమారు నెలకు రూ.38,483 ఉంటుంది.

విద్యార్హతలు అర్హతలు: అభ్యర్థులు 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి లైట్ మోటార్ వెహికల్ (LMV) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.

వయసు పరిమితి: అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలకు మించకూడదు (7 ఏప్రిల్ 2025 నాటికి). ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వ్ వర్గాల వారికి వయసులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

• అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి: https://igib.res.in
• ప్రకటన చదవండి: పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటనను చదవండి.
• ఆన్లైన్ నమోదు: రెజిస్ట్రేషన్ ఫారమ్ పూరించండి.
• డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి: వయస్సు, విద్యార్హతలు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
• దరఖాస్తు సమర్పించండి: 7 ఏప్రిల్ 2025 సాయంత్రం 8:00 గంటలలోపు దరఖాస్తును సమర్పించండి.

ఎంపిక విధానం:

అభ్యర్థుల ఎంపిక డ్రైవింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. డ్రైవింగ్ టెస్ట్‌లో అభ్యర్థుల నైపుణ్యాలు, ట్రాఫిక్ నియమాలపై అవగాహనను పరీక్షిస్తారు. ఇంటర్వ్యూలో వ్యక్తిగత నైపుణ్యాలు, అనుభవం, మరియు ఉద్యోగానికి సంబంధించిన ఇతర అంశాలను పరిశీలిస్తారు.

అప్లికేషన్ ఫీజు : సాధారణ మరియు OBC అభ్యర్థులకు: రూ.500 & SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు: ఫీజు లేదు

CSIR-IGIB డ్రైవర్ (నాన్-టెక్నికల్) పోస్టుల కోసం దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు :

• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మార్చి 15, 2025
• ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 07, 2025 సాయంత్రం 5 గంటలలోపు
• దరఖాస్తు లింక్:https://www.igib.res.in/

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!