District Collector Office Jobs : 7th, Any డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
District Collector Office Jobs : 7th, Any డిగ్రీ అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ అబార్డినేట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Andhra Pradesh District Collector Office Data Entry Operator & Office Subordinate Job Notification : విశాఖపట్నం జిల్లా వాణిజ్య పన్నుల శాఖలో ప్రాంతీయ G.S.T. ఆడిట్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయం వద్ద గల ఈ క్రింది ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తం ఖాళీలు 12 ఉన్నాయి. అవి… డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులకు ఇది ఒక అరుదైన అవకాశం.
పోస్టుల వివరాలు :
మొత్తం 12 పోస్టులు ఉండగా వీటిలో…
🔹డేటా ఎంట్రీ ఆపరేటర్ – 7 పోస్టులు
🔹ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు – 5 పోస్టులు
అర్హతలు :
🔹డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కంప్యూటర్ ఎం.ఎస్.ఆఫీస్ నందు డిప్లమా లేదా పీ.జీ.డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
🔹ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఏడవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
పోస్టులను అనుసరించి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు వరకు అభ్యర్థులు వయసు ఉండాలి.
ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరి వారికి గరిష్ట వయసు నందు సడలింపు ఇవ్వబడుతుంది.
నెల జీతం :
🔹డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు రూ.18,500/-లు నెల జీతం చెల్లిస్తారు.(APCOS నియమ నిబంధనలు అనుసరించి)
🔹 ఆఫీస్ సపార్డినేట్ పోస్టులకు రూ. 15,000/-లు నెల జీతం చెల్లిస్తారు.(APCOS నియమ నిబంధనలు అనుసరించి)
ఎంపిక విధానం :
🔹 ఇంటర్వ్యూ
🔹 డాక్యుమెంట్ వెరిఫికేషన్
అప్లై చేసుకున్న అభ్యర్థులలో అన్ని అర్హతలు గల అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ తేదీ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు విడిగా తెలియజేయబడతాయి.
ఈ పోస్టుల భర్తీ పూర్తిగా జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో గల APCOS-అవుట్సోర్సింగ్ కమిటీ, విశాఖపట్నం జిల్లా వారి ఆధ్వర్యంలో పారదర్శకంగా మెరిట్, పని అనుభవం మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఏ విధమైన ప్రలోభాలకు లోను కావద్దని కోరుతున్నారు.
దరఖాస్తు విధానం :
ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మీకు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని అర్హతలు ఉన్నట్లయితే ఈ ప్రకటనతో చేయబడిన దరఖాస్తు మాదిరి ప్రకారం వివరాలతో పాటు ఈ కింద పేర్కొన్న జిరాక్స్ కాపీస్ జతపరిచి తమ దరఖాస్తులను అదనపు కమిషనర్, ప్రాంతీయ G.S.T. ఆడిట్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయం మొదటి అంతస్తు V.M.R.D.A.భవనం, సిరిపురం, విశాఖపట్నం నందు ప్రత్యేకంగా ఉంచిన బాక్స్ నందు పైన నిర్ధారించిన తేదీ మరియు సమయం లోపు చేర్చవలెను లేదా రిజిస్టర్ పోస్ట్ నందు సదరు అడ్రస్సుకు గడువు తేదీ లోపల చేరేలా పంపించాల్సి ఉంటుంది.
🔹అర్హతల ధ్రువపత్రాలు
🔹కుల ధ్రువీకరణ పత్రము
🔹రేషన్ కార్డు
🔹ఆధార్ కార్డు
🔹అని అనుభవం ధృవపత్రం
🔹ఇతర ధ్రువపత్రాలు
ఆలస్యంగా అందిన దరఖాస్తులను తిరస్కరించబడతాయి.
దరఖాస్తు చేయు చివరి తేదీ :
03-05-2025.
🔷Official Notification PDF Click Here
🔷Application PDF Click Here
🔷Telegram Link Click Here
