Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

ఇంటర్ అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాల పంట |  RRB Notification 2025 Apply Now

ఇంటర్ అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాల పంట |  BRO Notification 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Railway Recruitment Board (RRB) Non Technical Popular Category job notification Apply Now  :  ప్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక భారీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికషన్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో కేంద్రంలో ఉద్యోగాలకు అవకాశం వచ్చేసింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ(NTPC)లో 3058 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB)లు ఆహ్వానం పలుకుతున్నాయి. పరీక్షల్లో పాస్ అయితే చాలు రైలులో పోస్టు ఖాయమై నట్లే. డైరెక్ట్/డిప్యుటేషన్ ప్రాతిపదికన నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. అర్హులైన అభ్యర్థులు 27 నవంబర్ 2025న రాత్రి 23:59 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అనగా…
దరఖాస్తులను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును మీ పూర్తి వివరాలతో ఫిలప్ చేసిన తర్వాత  అర్హతలకు సంబంధించిన మరియు ఇతర సంబంధిత ధ్రువపత్రాల కాపీలను అటాచ్ చేసి..
ఆన్లైన్ దరఖాస్తును వెంటనే అప్లై చేసుకోండి.

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏ పోస్టుకైనా దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు రుసుము లేదు. గరిష్ట వయసు పోస్టులను అనుసరించి 27 సంవత్సరాలు లోపు ఉండాలి. ఈ ఉద్యోగులకు అప్లై చేస్తే నెలకు రూ.19,900 – 21,700/-మధ్యలో జీతం ఇస్తారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 3058 ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే ఇతర విద్యార్హతలను క్రింద ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు 27 నవంబర్ 2025న రాత్రి 23:59 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Railway Recruitment Board (RRB)  Recruitment 2025, Latest 3058 Vacancy Overview :
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రెయిన్స్ క్లర్క్ పోస్టులు.
మొత్తం పోస్టుల సంఖ్య :3058
పోస్టులను అనుసరించి మిగిలిన వివరాలు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది :
నెల జీతం :: రూ.19,500/- నుండి రూ.21,700/-PM.
వయోపరిమితి :: పోస్టులను అనుసరించి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
విద్య అర్హత :: ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయి కోర్సులో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. డిగ్రీ లేదా పీజీ విద్యార్హత ఉంటే ఇంటర్లో 50 శాతం మార్కులు లేకపోయినా అర్హులే.
దరఖాస్తు ప్రారంభం :: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు చివరి తేదీ :: 27 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్సైట్ :: www.rrbapply.gov.in/

🔷పోస్టుల సంఖ్య :  నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ(ఎన్ టీపీసీ)లో
కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్-2424
అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్-394
జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్-163
ట్రెయిన్స్ క్లర్క్-77
మొత్తం – 3058 ఖాళీలు ఉన్నాయి.

🔷విద్యార్హత :
🔹ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ (27.11.2025) నాటికి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం/సంస్థ నుండి CENలో నిర్దేశించిన కనీస విద్యార్హతలను అనగా ఇంటర్మీడియట్ లేదా సమాన స్థాయి కోర్సులో 50 శాతం మార్కులు లేదా డిగ్రీ లేదా పీజీ విద్యార్హత ఉంటే ఇంటర్లో 50 శాతం మార్కులు కలిగి ఉండాలి.
🔹నిర్దేశించిన విద్యా అర్హత యొక్క తుది పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు దరఖాస్తు చేయకూడదు.
🔹ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
🔷నెల జీతం :
పోస్ట్ ను అనుసరించి…
నెలవారీ జీతం రూ.19,900/- నుండి రూ.21,700/- వరకు చెల్లిస్తారు.

వయోపరిమితి: కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC, PwBD మరియు మాజీ సైనికులకు రిజర్వ్ చేయబడిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు వయస్సులో సడలింపు అనుమతించబడుతుంది. పోస్టులను అనుసరించి గరిష్ట వయసు 30 సంవత్సరాలు గా నిర్ధారించారు.

దరఖాస్తు రుసుము: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాన్స్ జెండర్, ఈబీసీలకు రూ.250. వీరు సీబీటీకి హాజరైతే బ్యాంకు చార్జీలు మినహాయించి, మిగిలిన ఫీజు వెనక్కి చెల్లిస్తారు. ఇతర వర్గాల వారికి ఫీజు రూ.500. వీరు సీబీటీకి హాజరైతే రూ.100+బ్యాంకు ఛార్జీలు మినహాయించి మిగిలినవి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది.

ఎంపిక విధానం: అన్ని పోస్టులకూ రెండు దశల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్టు (CBT)లో ప్రావీణ్యం చూపాలి. టైపిస్ట్ (అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్) పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్టు (TST) నిర్వహిస్తారు. ఆ తర్వాత ద్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

పరీక్ష విధానం:
🔹స్టేజ్-1: వంద ప్రశ్నలు. వీటికి 90 నిమిషాలు, జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు వస్తాయి.
🔹స్టేజ్-2: స్టేజ్-1లో అర్హత పొందినవారి నుంచి, కేటగిరీల వారీ ఉన్న ఖాళీలకు మెరిట్ ప్రకారం 15 రెట్ల మందిని స్టేజ్-2కు అవకాశమిస్తారు. దీన్ని 120 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు వస్తాయి.
🔹కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్టు (సీబీటీఎస్టీ): జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్టు (సీబీటీఎస్టీ) ఉంటుంది. స్టేజ్-2లో అర్హుల జాబితా నుంచి మెరిట్ ప్రకారం కేటగిరీల వారీ ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో అభ్యర్ధులకు టైపింగ్ స్కిల్ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఇంగ్లీష్లో నిమిషానికి 30 హిందీ అయితే 25 పదాలు టైప్ చేయాలి.

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో

దరఖాస్తు చివరి తేదీ:
•ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 27.11.25

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!