10th Pass Jobs : MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి | CSIR-NMLRecruitment 2025 Online Apply Now
10th Pass Jobs : MTS ఉద్యోగాల కోసం అప్లై చేసుకోండి | CSIR-NML Recruitment 2025 Online Apply Now
CSIR-NML Recruitment 2025 Latest MTS Jobs Notification Apply Online Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ(NML) కింది పోస్టుల కోసం అర్హత కలిగిన భారతీయుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్(గ్రూప్ ‘C’, నాన్-గెజిటెడ్) పోస్టులను భర్తీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 06 ఫిబ్రవరి 2026 లోపల https://nml.res.in. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 మల్టీ టాస్కింగ్ స్టాఫ్(గ్రూప్ ‘C’, నాన్-గెజిటెడ్) పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. పదో తరగతి, ఐటిఐ తదితర…. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 25 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://nml.res.in. లో ఆన్లైన్ లో 06 ఫిబ్రవరి 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన CSIR-నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹మల్టీ టాస్కింగ్ స్టాఫ్(గ్రూప్ ‘C’, నాన్-గెజిటెడ్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹 మల్టీ టాస్కింగ్ స్టాఫ్(గ్రూప్ ‘C’, నాన్-గెజిటెడ్) : ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ఇచ్చే పని ఆధారంగా ఈ క్రింది అర్హతలను నిర్ధారించారు….
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10వ తరగతి/మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత (లేదా) ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ITI ఉత్తీర్ణత (లేదా) కార్పెంటర్ ట్రేడ్లో ITI ఉత్తీర్ణత (లేదా) ఫిట్టర్ ట్రేడ్లో ITI ఉత్తీర్ణత (లేదా) ప్లంబర్ ట్రేడ్లో ITI ఉత్తీర్ణత (లేదా) ఎయిర్ కండిషనింగ్ (AC) & రిఫ్రిజిరేషన్ ట్రేడ్లో ITI ఉత్తీర్ణత (లేదా) కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) ట్రేడ్లో ITI ఉత్తీర్ణత.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 పోస్టులను అనుసరించి 18-25 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹మల్టీ టాస్కింగ్ స్టాఫ్(గ్రూప్ ‘C’, నాన్-గెజిటెడ్) ఉద్యోగాలకు : నెలకు రూ. 18,000 నుండి రూ. 56,900 జీతం చెల్లిస్తారు.
( ఉద్యోగంలో చేరగానే ₹ 36,000/- నెల జీతం చెల్లిస్తారు )
🔷దరఖాస్తు ఫీజు:
పోస్టులనుసరించి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500/-, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.00/- చెల్లించాల్సి ఉంటుంది.
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 06 ఫిబ్రవరి 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు.
🔹 అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి.
🔹దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
* కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ పరీక్ష నిర్వహిస్తారు.
* మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు నిర్వహించే పోటీ రాత పరీక్ష ఒకే పేపర్తో కూడి ఉంటుంది, నాలుగు (04) భాగాలు క్రింద వివరించబడ్డాయి:

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06.02.26
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).
👉 అధికారిక వెబ్సైట్: https://nml.res.in.
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

