Andhra Pradesh jobsGovernment Jobs

ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply

ప్రభుత్వ సంస్థలో జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్, సూపరింటెండెంట్ ఉద్యోగాల భర్తీ | IIITDMK Recruitment 2025 Online Apply

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIITDMK Recruitment 2025 Latest Non Teaching Jobs Notification Apply Online Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (IIITDMK) నుండి కింది బోధనేతర పోస్టుల కోసం అర్హత కలిగిన భారతీయుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, స్టాఫ్ నర్స్, జూనియర్ సూపరింటెండెంట్ తదితర.. పోస్టులను భర్తీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 24 జనవరి 2026 లోపల www.iiitk.ac.in. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (IIITDMK) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, స్టాఫ్ నర్స్, జూనియర్ సూపరింటెండెంట్ తదితర.. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. బ్యాచులర్స్ డిగ్రీ, డిప్లమా, ఐఐటీ, బిఎస్సి, ఇంజనీరింగ్  తదితర…. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 45 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ www.iiitk.ac.in. లో ఆన్లైన్ లో 24 జనవరి 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (IITDMK) ద్వారా ఈ క్రింది బోధనేతర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, స్టాఫ్ నర్స్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్టార్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹జూనియర్ అసిస్టెంట్ : 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత మరియు కంప్యూటర్ ఆపరేషన్స్ లో పరిజ్ఞానం కలిగి ఉండాలి.

🔹 జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, కంప్యూటర్ సెంటర్ కోసం, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాలకు) : ఇంజనీరింగ్/బ్యాచిలర్ డిగ్రీలో డిప్లొమా లేదా ఫస్ట్ క్లాస్ తో ఐటీఐ మరియు ఆయా విభాగానికి సంబంధించిన పనిలో గాని లేదా అనుబంధ బ్రాంచ్లలో రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

🔹 ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ : ఫస్ట్ క్లాస్ తో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (BPEd) ఉత్తీర్ణత మరియు BPEd తర్వాత 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

🔹 స్టాఫ్ నర్స్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి నర్సింగ్లో ఫస్ట్ క్లాస్తో బిఎస్సి మరియు బిఎస్సి తర్వాత 2 సంవత్సరాల అనుభవం. (లేదా) నర్సింగ్ & మిడ్వైఫరీలో ఫస్ట్ క్లాస్తో 3 సంవత్సరాల డిప్లొమా 5 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.

🔹జూనియర్ సూపరింటెండెంట్ : 55% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది మరియు పరిపాలన/ఖాతాలు/విద్యా శాస్త్రం/స్టోర్లు & కొనుగోలులో 6 సంవత్సరాల అనుభవం)

🔹జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (మెకానికల్ ఇంజనీరింగ్) : UG డిగ్రీ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్తో బిఇ/బిటెక్ మరియు 5 సంవత్సరాల అనుభవం

🔹అసిస్టెంట్ రిజిస్టార్ : 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి.

🔹టెక్నికల్ ఆఫీసర్ : సంబంధిత ప్రాంతంలో యుజి డిగ్రీ తర్వాత ఫస్ట్ క్లాస్ తో బిఇ/బిటెక్/ఎంఎస్సీ/ఎంసీఏ మరియు 8 సంవత్సరాల అనుభవం. లేదా ఫస్ట్ క్లాస్ తో ME/MTech మరియు 5 సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹 పోస్టులను అనుసరించి 18-45 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹 జూనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు : రూ. 21,700 నుండి రూ. 69,100 వరకు నెల జీతం చెల్లిస్తారు.

🔹 జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు : రూ. 35,400 నుండి రూ. 1,12,400 వరకు నెల జీతం చెల్లిస్తారు.

🔹 టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టార్ పోస్టులకు : రూ. 56,100 నుండి రూ. 1,77,500 వరకు నెల జీతం చెల్లిస్తారు.

🔷దరఖాస్తు ఫీజు:
పోస్టులనుసరించి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు  రూ.500/-, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులకు, దివ్యాంగులకు, మహిళా అభ్యర్థులకు  అప్లికేషన్ ఫీజు రూ.00/- చెల్లించాల్సి ఉంటుంది.

🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 24 జనవరి 2026

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
* పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 24.01.26
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).

👉 అధికారిక వెబ్సైట్: www.iiitk.ac.in.

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *