Andhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now

Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ | NITW – Non Teaching Recruitment 2025 Online Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NITW Recruitment 2025 Latest Junior Assistant, Technician, Senior Assistant Jobs Notification Apply Online Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NITW) నుండి కింది బోధనేతర పోస్టుల కోసం అర్హత కలిగిన భారతీయుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర.. పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్రింద భర్తీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 08 ఫిబ్రవరి 2026 లోపల https://nitw.ac.in/Careers/.అధికారికవెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NITW) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర.. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. 10+2, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లమా, ఐఐటీ, బిఎస్సి, ఇంజనీరింగ్  తదితర…. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 33 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://nitw.ac.in/Careers/. లో ఆన్లైన్ లో 08 ఫిబ్రవరి 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ (NITW)ద్వారా ఈ క్రింది బోధనేతర పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను విభాగాల వారీగా ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹సూపరింటెండెంట్.
🔹టెక్నికల్ అసిస్టెంట్ – సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్&ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సర్వీసెస్ కేంద్రం (CDIS), ఎస్టేట్, హార్టికల్చర్, మెకానికల్ ఇంజనీరింగ్.
🔹సీనియర్ అసిస్టెంట్.
🔹సీనియర్ టెక్నీషియన్ – కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్&ఇంజనీరింగ్, ఫిజిక్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సర్వీసెస్ కేంద్రం (CDIS), ఎస్టేట్.
🔹జూనియర్ అసిస్టెంట్
🔹టెక్నీషియన్ – సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్&ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సర్వీసెస్ కేంద్రం (CDIS), ఎస్టేట్, ఆడియో విజువల్ (AV) విభాగం.

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹సూపరింటెండెంట్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి కనీసం 50% మార్కులు లేదా తత్సమాన గ్రేడ్తో ఏదైనా విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔹 టెక్నికల్ అసిస్టెంట్ : ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు ఆయా విభాగాలను అనుసరించి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి పోస్ట్ కి తగిన విభాగంలో బి.ఇ. / బి.టెక్‌లో ఫస్ట్ క్లాస్ కొన్ని విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదా తత్సమాన గ్రేడ్ లేదా అద్భుతమైన విద్యా రికార్డుతో ఆయా విభాగంలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా.

🔹సీనియర్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2) ఉత్తీర్ణత మరియు కనీసం 35 w.p.m. టైపింగ్ వేగం మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్ప్రెడ్‌షీట్‌లో ప్రావీణ్యం.

🔹సీనియర్ టెక్నీషియన్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 60% మార్కులతో సైన్స్ తో సీనియర్ సెకండరీ (10+2). లేదా కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2) మరియు ITI ఆయా విభాగాలకి సంబంధించిన ట్రేడ్‌లో ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి గల కోర్సు. లేదా కనీసం 60% మార్కులతో సెకండరీ (10) మరియు ఆయా విభాగాలకి సంబంధించిన ట్రేడ్‌లో 2 సంవత్సరాల వ్యవధి గల ITI సర్టిఫికేట్. లేదా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ / ఇన్స్టిట్యూట్ నుండి ఆయా విభాగాలలో మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా.

🔹జూనియర్ అసిస్టెంట్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ (10+2) ఉత్తీర్ణత మరియు కనీసం 35 w.p.m. టైపింగ్ వేగం మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్ప్రెడ్‌షీట్‌లో ప్రావీణ్యం.

🔹టెక్నీషియన్ :ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 60% మార్కులతో సైన్స్‌తో సీనియర్ సెకండరీ (10+2). లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ (10+2) మరియు అయా విభాగాలకు సంబంధించిన ట్రేడ్‌లో ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ వ్యవధి గల ITI కోర్సు. లేదా కనీసం 60% మార్కులతో సెకండరీ (10) మరియు ఆయా విభాగాలకు సంబంధించిన ట్రేడ్‌లో 2 సంవత్సరాల వ్యవధి గల ITI సర్టిఫికేట్. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ / ఇన్‌స్టిట్యూట్ నుండి ఆయా విభాగాలలో మూడేళ్ల వ్యవధి గల డిప్లొమా.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹 పోస్టులను అనుసరించి 18-33 సంవత్సరాల మధ్య అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹 సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు : రూ. 35,400 నుండి రూ.1,12,400 వరకు నెల జీతం చెల్లిస్తారు.

🔹 సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ పోస్టులకు : రూ. 25,500 నుండి రూ. 81,100 వరకు నెల జీతం చెల్లిస్తారు.

🔹జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు : రూ.21,700 నుండి రూ.69,100 వరకు నెల జీతం చెల్లిస్తారు.

🔷దరఖాస్తు ఫీజు:
పోస్టులనుసరించి జనరల్, ఓబీసీ, మాజీ సైనికులు అభ్యర్థులు ఆన్లైన్ ఫెసిలిటేషన్/ ప్రాసెసింగ్ చార్జెస్ రూ.1000/-, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళా అభ్యర్థులు రూ.1000/- చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మహిళా అభ్యర్థులకు పరీక్ష/ దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగిలిన వారందరూ రూ. 500/- చెల్లించాల్సి ఉంటుంది.

🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 08 ఫిబ్రవరి 2026

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
* పోస్టులను అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్ (దరఖాస్తుదారుల షార్ట్లిస్ట్ ప్రయోజనం కోసం మాత్రమే), నైపుణ్య పరీక్ష మరియు ప్రధాన రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08.02.26
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).

👉 అధికారిక వెబ్సైట్: https://nitw.ac.in/Careers/.

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *