SIM Reduced Recharge Rates : BSNL దెబ్బకు రీఛార్జ్ రేట్లు తగ్గింపు పూర్తి వివరాలు తెలుగులో
SIM Reduced Recharge Rates : BSNL దెబ్బకు రీఛార్జ్ రేట్లు తగ్గింపు పూర్తి వివరాలు తెలుగులో
Recharge Rates :- BSNL తక్కువ రేట్ల సేవలు అందించడంతో ప్రైవేట్ టెలికం కంపెనీలు ధరలు తగ్గించడంపై యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ ఆపరేటర్లు ఇటీవల రీఛార్జ్ రేట్లను పెంచడం వల్ల అనేక మంది వినియోగదారులు BSNL వైపు ఆకర్షితులవుతున్నారు. BSNL రేట్లతో పోలిస్తే ప్రైవేట్ టెలికం సంస్థల రీఛార్జ్ రేట్లు అధికంగా ఉండటంతో వినియోగదారులు సంతృప్తి లేకుండా పోయారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలు తమ రేట్లను తగ్గించి, వినియోగదారుల్ని కాపాడుకోవాలని భావిస్తున్నట్లు నేషనల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం టెలికం కంపెనీలపై విధించే లైసెన్స్ ఫీజును 8% నుండి 0.5-1%కి తగ్గించాలని కూడా ప్రైవేట్ టెలికం ఆపరేటర్లు కోరుతున్నట్లు సమాచారం. ఈ తగ్గింపులు జరిగితే, ప్రైవేట్ సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకుని, వినియోగదారులకు తక్కువ ధరల సేవలు అందించగలవు.
త్వరలో దీనిపై మరిన్ని వివరాలు రానున్నట్లు తెలుస్తోంది