Good News : ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి బస్సులు ప్రయాణికులకు శుభవార్త
Good News : ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి బస్సులు ప్రయాణికులకు శుభవార్త
APSRTC News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీ ఏ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్లకైనా వర్తిస్తుంది, అలాగే ఏ RTC బస్సులోనైనా ఉపయోగించుకోవచ్చు.
సీనియర్ సిటిజన్లుగా పరిగణించబడేందుకు ప్రయాణికులు కనీసం 60 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. రాయితీ పొందడానికి ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, లేదా రేషన్ కార్డు వంటి గుర్తింపు పత్రాలు చూపించాలి. ఈ పత్రాలు ఫిజికల్ లేదా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటే సరిపోతుందని APSRTC తెలిపింది.