Breaking News : తెలంగాణ 10th హాల్ టికెట్లు విడుదల
Breaking News : తెలంగాణ 10th హాల్ టికెట్లు విడుదల
Telangana SSC 2025 Exams Hall Tickets Download: తెలంగాణ రాష్ట్రంలో 10th పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు ఈరోజు ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ అయిన https://bse.telangana.gov.in/ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

తెలంగాణ SSC హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేయడానికి సూచనలు:
• bse.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
• హోమ్‌పేజీలో ‘SSC Hall Tickets 2025’ లింక్‌ను క్లిక్ చేయండి.
• Next పేజీలో, మీ జిల్లా, పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయండి. ‘డౌన్‌లోడ్’ బటన్‌ను క్లిక్ చేయండి.
• మీ హాల్ టికెట్‌ను ప్రింట్ తీసుకుని భద్రపరచుకోండి.
ఈ సంవత్సరం 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు 21 మార్చి 2025 నుండి 2 ఏప్రిల్ 2025 మధ్యలో పరీక్షలు ఉంటాయి. హాల్ టికెట్‌లో పేర్కొన్న పరీక్ష తేదీలు, సమయం, పరీక్ష కేంద్రం వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి.
హాల్ టికెట్ లేకుండా పరీక్షకు హాజరు కావడానికి అనుమతి లేదు. కావున, హాల్ టికెట్‌ను సకాలంలో డౌన్‌లోడ్ చేసుకుని, పరీక్ష సమయంలో తీసుకురావడం తప్పనిసరి.
మరిన్ని వివరాలకు లేదా సందేహాల నివృత్తికి, మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులను లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

🛑Direct Link Click Here