10th Pass Govt Jobs రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | BECIL Recruitment 2025 In Telugu | Job Search
10th Pass Govt Jobs రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ | BECIL Recruitment 2025 In Telugu | Job Search
BECIL Recruitment 2025 Latest Data Entry Operator, Driver Job Notification Apply offline Now : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) వివిధ పోస్టులను భర్తీ చేయడానికి ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టులను అనుసరించి పదో తరగతి, 12th, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తదితర అర్హతలను కలిగి ఉన్న వారిని డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), డ్రైవర్ తదితర పోస్టుల నియామకాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం సర్టిఫికెట్ ఉంటే అప్లై చేసుకోండి పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికగా జరుగనున్నాయి. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 7 డిసెంబర్ 2025 లోపల https://www.becil.com/అధికారికవెబ్సైట్ ద్వారా ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), డ్రైవర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు పూర్తిచేసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 సంవత్సరాలు నుంచి 40 మధ్యలో కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://www.becil.com/లో ఆఫ్లైన్ లో 7 డిసెంబర్ లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL)ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
🔹డ్రైవర్ – 05
🔹 డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) – 10
🔹Medical Physicist (రేడియాలజీ) – 1
🔹Medical Physicist (రేడియాలజీ) -1
🔹Medical Physicist (న్యూక్లియర్ మెడిసిన్) -1
పోస్టులను భర్తీ చేయనున్నారు.
పైన ఇవ్వబడిన మొత్తం పోస్టుల సంఖ్య – 18
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు….
🔹డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణత.
* భారీ వాహనాలను నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్.
* మోటార్ మెకానిజం పరిజ్ఞానం.
* 03 సంవత్సరాల పని అనుభవం.
🔹డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) – కనీసం 12వ తరగతి ఉత్తీర్ణత
* విండోస్,i.e. word వంటి కంప్యూటర్ ప్యాకేజీలతో బాగా పరిచయం ఉన్నవాడు, ఏదైనా ప్రభుత్వ/గుర్తింపు పొందిన ప్రైవేట్ సంస్థ నుండి DOEACC ఎక్సెల్ కోర్సు లేదా తత్సమానం. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్/ఇ-మెయిల్లో మంచి పని పరిజ్ఞానం.
* కంప్యూటర్లో నిమిషానికి 35 పదాల కంటే ఎక్కువ టైపింగ్ వేగం (ఇంగ్లీష్).
🔹Medical Physicist ( రేడియో థెరపీ) – ఎసెన్షియల్ క్వాలిఫికేషన్
* గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
* గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి రేడియోలాజికల్/మెడికల్ ఫిజిక్స్లో పోస్ట్ M.Sc డిప్లొమా & గుర్తింపు పొందిన, బాగా అమర్చబడిన రేడియేషన్ థెరపీ విభాగంలో కనీసం 12 నెలల ఇంటర్న్షిప్.
🔹Medical Physicist (రేడియాలజీ) – గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి M.Sc. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, మరియు AERB ద్వారా గుర్తింపు పొందిన IL RSO స్థాయి-II సర్టిఫికేషన్.
🔹Medical Physicist (న్యూక్లియర్ మెడిసిన్)
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి M.Sc. న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, మరియు AERB ద్వారా గుర్తింపు పొందిన IL RSO స్థాయి-II సర్టిఫికేషన్.
🔷వయసు పరిమితి (Age limit) : పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
* డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు – 40 సంవత్సరాలు
* మిగిలిన పోస్టులకు – 35 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹డ్రైవర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు – రూ.25,506/-
🔹మిగిలిన పోస్టులకు – రూ.75,000/-
పై పోస్టులలో కొన్నింటికి ఇతర అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి.
🔷దరఖాస్తు ఫీజు:
పోస్టులనుసరించి జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.295, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.00 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 7 డిసెంబర్ 2025
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.becil.com/ లో కి వెళ్లండి.”Recruitment” లేదా “Job Opportunities” సెక్షన్లో అడిగిన పోస్టులు చూడండి.
🔹 అభ్యర్థి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
🔹అభ్యర్థులు తమ దరఖాస్తును సాధారణ పోస్ట్/రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్ (ఇండియన్ పోస్టల్ సర్వీసెస్ ద్వారా) ద్వారా మాత్రమే పంపాలి.
🔹 పోస్టులను అనుసరించి క్రింద ఇవ్వబడిన అవసరమైన పత్రాలను (స్వీయ-ధృవీకరించబడిన ఫోటో కాపీ) దరఖాస్తుతో పాటు జతచేయాలి.
* విద్యా/వృత్తిపరమైన ధృవపత్రాలు.
* 10వ, 12వ (వర్తిస్తే) తరగతి ఉత్తీర్ణత పత్రం.
* జనన ధృవీకరణ పత్రం.
* కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
* పని అనుభవ ధృవీకరణ పత్రం (వర్తిస్తే)
* పాన్ కార్డ్ కాపీ
* ఆధార్ కార్డ్ కాపీ
* EPF/ESIC కార్డ్ కాపీ (పూర్తి యజమాని-వర్తిస్తే)
* బ్యాంక్ పాస్బుక్. బ్యాంక్ ఖాతా వివరాలను పేర్కొన్న కాపీ.
🔷చిరునామా:
బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL),
BECIL భవన్,
C-56/A-17,
సెక్టార్-62,
నోయిడా-201307 (U.P)
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹ఎంపిక విధానం లో ప్రతి ఒక్క పోస్టుకు అప్లికేషన్లను స్క్రీనింగ్ చేయడం (అర్హత ప్రమాణాలు పరిశీలించడం) ద్వారా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
🔹 తరువాత స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
🔹 చివరగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తూ ఇంటర్వ్యూ జరుపుతారు.
🔹 షార్ట్ లిస్ట్ చేయబడిన వారిని స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కోసం ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తారు.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 7.12.25
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు.( ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే)
👉 అధికారిక వెబ్సైట్: https://www.becil.com/
🔷Notification PDF Click Here
🔷Application Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here


