IRCTC Recruitment 2026: 44 అప్రెంటిస్ పోస్టులు.. అర్హత, స్టైపెండ్, అప్లై వివరాలు
IRCTC Recruitment 2026: 44 అప్రెంటిస్ పోస్టులు.. అర్హత, స్టైపెండ్, అప్లై వివరాలు
IRCTC Apprentice Recruitment 2026 : IRCTC రిక్రూట్మెంట్ 2026 ద్వారా కోల్కతా ఈస్ట్ జోన్లో 44 అప్రెంటిస్ పోస్టుల భర్తీ. అర్హతలు, వయస్సు, నెలవారీ స్టైపెండ్, ఎంపిక విధానం, చివరి తేదీ వివరాలు తెలుసుకోండి.
నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కోల్కతాలోని ఈస్ట్ జోన్లో మొత్తం 44 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 26, 2026లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టుల వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు 34, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) పోస్టులు 10 భర్తీ చేయనున్నారు. మొత్తం 44 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు : పోస్టును బట్టి కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ఐటీఐ లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు తమ పోస్టుకు సంబంధించిన విద్యార్హతలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
వయోపరిమితి : 2026 అక్టోబర్ 9 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
స్టైపెండ్ ఎంత : ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,600 నుంచి రూ.12,300 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు. స్టైపెండ్ మొత్తం పోస్టును బట్టి మారవచ్చు.
ఎంపిక విధానం : అభ్యర్థులను వారి విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికకు సంబంధించిన పూర్తి నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో తెలుసుకోవాలి.
ముఖ్యమైన తేదీ
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 అక్టోబర్ 26. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
ఎలా దరఖాస్తు చేయాలి : అభ్యర్థులు IRCTC అధికారిక వెబ్సైట్ను సందర్శించి, సంబంధిత అప్రెంటిస్ నోటిఫికేషన్ను పరిశీలించాలి. అర్హతలు సరిపోతే సూచించిన విధంగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి.
దరఖాస్తు చేసుకునే ముందు పోస్టుల వారీగా అర్హతలు, అవసరమైన సర్టిఫికెట్లు, ఎంపిక విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్లో నిర్ధారించుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
