Hindustan Copper Recruitment 2026: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో 171 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. 10th, ITI అర్హతతో దరఖాస్తు!
Hindustan Copper Recruitment 2026: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో 171 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. 10th, ITI అర్హతతో దరఖాస్తు!
Hindustan Copper Trade Apprentice Recruitment 2026 : హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL) నుంచి నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. మధ్యప్రదేశ్లోని మలంజ్ఖండ్ కాపర్ ప్రాజెక్టులో ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం 171 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి, ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు తమకు అర్హత ఉన్న ట్రేడ్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేసే ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 24, 2026.

HCL Trade Apprentice Vacancy Details 2026 : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ట్రేడుల్లో 171 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ట్రేడ్ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
• Mate Mines (Fresher) : 04
• Shotfirer / Blaster : 13
• Driver Cum Mechanic : 06
• Diesel Mechanic : 10
• Fitter : 16
• Turner / Machinist : 16
• Electrician : 36
• Welder : 16
• Draftsman (Civil) : 02
• Draftsman (Mechanical) : 03
• Computer Assistant : 20
• Surveyor : 03
• AC & Refrigeration Mechanic : 02
• Building Constructor : 02
• Carpenter : 03
• Plumber : 03
• Horticulture Assistant : 02
• Instrument Mechanic : 10
• Solar Technician : 04
• మొత్తం : 171
విద్యార్హతలు : మేట్ మైన్స్, షాట్ఫైరర్/బ్లాస్టర్, డ్రైవర్ కమ్ మెకానిక్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన పోస్టులకు సంబంధిత ట్రేడులో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఎంపిక విధానం : ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించకుండా విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. మెరిట్లో ఎంపికైన అభ్యర్థులకు తదుపరి సర్టిఫికెట్ల పరిశీలన, ఇతర అర్హతల ప్రక్రియ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
• దరఖాస్తుల ప్రారంభం : నవంబర్ 05, 2026
• దరఖాస్తుకు చివరి తేదీ : నవంబర్ 24, 2026
• సంస్థ : Hindustan Copper Limited
• ఉద్యోగ ప్రాంతం : మలంజ్ఖండ్, మధ్యప్రదేశ్
• దరఖాస్తు విధానం : ఆన్లైన్
ఎలా అప్లై చేయాలి : అర్హత ఉన్న అభ్యర్థులు హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్లోని Careers విభాగాన్ని సందర్శించాలి. అక్కడ Trade Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ను ఓపెన్ చేసి, అందులో ఇచ్చిన సూచనల ప్రకారం దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవాలి.
దరఖాస్తు ప్రక్రియలో Apprenticeship India పోర్టల్ రిజిస్ట్రేషన్ తదితర సూచనలు కూడా అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించండి.

ముఖ్యమైన లింకులు :
🛑Notification Pdf Click Here
🛑HCL Official Website Click Here
