Good News : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
Good News : ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన
Andhra Pradesh New Pensions : అర్హులైన పెన్షన్దారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. డిసెంబర్ మొదటి వారం నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ సౌకర్యం ద్వారా అర్హులైన వ్యక్తులు గ్రామ స్థాయిలోనే తమ పెన్షన్ సేవలను అందుకోవచ్చు.
గ్రామస్థాయిలో పెన్షన్ సేవలు : గ్రామంలో ఒక్కటి లేదా రెండు నెలల పాటు లేకపోయినా, తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇది పెన్షన్దారులకు గణనీయమైన లబ్ధిని కల్పిస్తుంది.
పెన్షన్ దుర్వినియోగంపై చర్యలు : అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తించినప్పుడు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.