Andhra Pradesh jobsCentral Government JobsGovernment JobsTelangana Jobs

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో 11,403 క్లర్కు ఉద్యోగ నోటిఫికేషన్ || Latest IBPS Recruitment 2026 Apply Now

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో 11,403 క్లర్కు ఉద్యోగ నోటిఫికేషన్ || Latest IBPS Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest IBPS Recruitment 2026 Latest Office Assistant Job Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన RRBల (CRP RRBs XIV) కొరకు రాబోయే ఉమ్మడి నియామక ప్రక్రియ ఆన్లైన్ పరీక్షలను, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. గ్రూప్ “A”- అధికారులు (స్కేల్-I, II & III) మరియు గ్రూప్ “B”- ఆఫీస్ అసిస్టెంట్ల (మల్టీపర్పస్) పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన ఇతర వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21 సెప్టెంబర్ 2026 లోపల https://www.ibps.in/. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ “A”- అధికారులు (స్కేల్-I, II & III) మరియు గ్రూప్ “B”- ఆఫీస్ అసిస్టెంట్ల (మల్టీపర్పస్).. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. మెట్రిక్యులేషన్ (SSC) లేదా దానికి సమానమైన అర్హతలో ఉత్తీర్ణత, బాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 40 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://www.ibps.in/. లో ఆన్లైన్ లో 21 సెప్టెంబర్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

🔷పోస్టుల వివరాలు :

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹గ్రూప్ “A”- ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్)
🔹గ్రూప్ “B”- ఆఫీసర్ స్కేల్ – I (అసిస్టెంట్ మేనేజర్), ఆఫీసర్ స్కేల్ -II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్), ఆఫీసర్ స్కేల్ -II స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (మేనేజర్), ఆఫీసర్ స్కేల్ – III (సీనియర్ మేనేజర్).

మొత్తం 11,403 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..

🔹 ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది పాల్గొనే RRB/లచే సూచించబడిన విధంగా స్థానిక భాషలో ప్రావీణ్యం.

🔹 ఆఫీసర్ స్కేల్ – I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత. వ్యవసాయం, ఉద్యానవనం, అటవీ శాస్త్రం, పశుసంవర్ధక శాస్త్రం, పశువైద్య శాస్త్రం, వ్యవసాయ ఇంజనీరింగ్, మత్స్య శాస్త్రం, వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకారం, సమాచార సాంకేతికత, నిర్వహణ, న్యాయశాస్త్రం, అర్థశాస్త్రం లేదా అకౌంటెన్సీలో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పాల్గొనే RRB/లచే సూచించబడిన విధంగా స్థానిక భాషలో ప్రావీణ్యం.

🔹 ఆఫీసర్ స్కేల్ -II జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతతో పాటు మొత్తం మీద కనీసం 50% మార్కులు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, వ్యవసాయం, ఉద్యానవనం, అటవీశాస్త్రం, పశుసంవర్ధనం, పశువైద్య శాస్త్రం, వ్యవసాయ ఇంజనీరింగ్, మత్స్యశాస్త్రం, వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకారం, సమాచార సాంకేతికత, నిర్వహణ, న్యాయశాస్త్రం, అర్థశాస్త్రం మరియు అకౌంటెన్సీ రంగాలలో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

🔹 ఆఫీసర్ స్కేల్ -II స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (మేనేజర్) పోస్టులకు : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ / కమ్యూనికేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా దానికి సమానమైన సబ్జెక్టులో మొత్తం మీద కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ.

🔹 ఆఫీసర్ స్కేల్ – III (సీనియర్ మేనేజర్) పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హతతో పాటు మొత్తం మీద కనీసం 50% మార్కులు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, వ్యవసాయం, ఉద్యానవనం, అటవీశాస్త్రం, పశుసంవర్ధక శాస్త్రం, పశువైద్య శాస్త్రం, వ్యవసాయ ఇంజనీరింగ్, మత్స్యశాస్త్రం, వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకారం, సమాచార సాంకేతికత, నిర్వహణ, న్యాయశాస్త్రం, అర్థశాస్త్రం మరియు అకౌంటెన్సీలలో డిగ్రీ/డిప్లొమా ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…

🔹పోస్టులను అనుసరించి 40 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా  వర్తిస్తాయి.

🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

🔹 పోస్టులను అనుసరించి నెల జీతం రూ.24,000/- to రూ.64,000/- వరకు చెల్లిస్తారు.

🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) : ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల అభ్యర్థులకు రూ.175/- (జీఎస్టీతో కలిపి). మిగతా అందరికీ రూ.850/- (జీఎస్టీతో కలిపి).
ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) : ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు/ మాజీ సైనికులు/ దేశ మాజీ సైనికులు అభ్యర్థులకు రూ.175/- (జీఎస్టీతో కలిపి).మిగతా అందరికీ రూ.850/- (జీఎస్టీతో కలిపి).

🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 21 సెప్టెంబర్ 2026

🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.

🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఎంపిక విధానం:

షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మాత్రమే ప్రిలిమినరీ  & మెయిన్ ఎగ్జామినేషన్స్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 21 సెప్టెంబర్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).

👉 అధికారిక వెబ్సైట్: https://www.ibps.in/.

🔷Notification PDF Click Here

🔷Apply Link Click Here

🔷Telegram Link Click Here

🔷Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *