Telangana Jobs

TS Anganwadi Jobs : అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

TS Anganwadi Jobs : అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Teacher Recruitment 2026 Telangana District Wise Posts : తెలంగాణ మరొక జిల్లాలో 55 అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు ఇంటర్ అర్హతతో 18-35 ఏళ్ల మహిళ అభ్యర్థులు అక్టోబర్ 6 లోపు వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.

జిల్లాలోని (03) ఐ.సి.డి.ఎస్. (ICDS) ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరడమైనది. దరఖాస్తు ప్రారంభ తేది: 22.09.2026 నుంచిbదరఖాస్తు ముగింపు తేది: 06.10.2026 (సాయంత్రం 05:00 గంటల వరకు) లోపు http://wdcw.tg.nic.in ఆన్లైన్లో అప్లై చేసుకోండి.

విద్యార్హత, వయస్సు : అంగన్వాడీ టీచర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 12వ తరగతి (ఇంటర్) ఉత్తీర్ణులై ఉండాలి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఈ పోస్టుల భర్తీలో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

ఎంపిక విధానం : అంగన్వాడీ టీచర్ పోస్టులకు మొత్తం 100 మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇంటర్‌లో సాధించిన మార్కుల మెరిట్‌కు 70 మార్కులు కేటాయిస్తారు. వితంతువులకు 5 మార్కులు, అనాథలకు 10 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు అదనంగా లభిస్తాయి. అలాగే జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూకు 10 మార్కులు ఉంటాయి. ఈ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ఖాళీల వివరాలు : హనుమకొండ జిల్లాలోని 3 ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 55 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో

•భీమదేవరపల్లి ప్రాజెక్టులో : 23
•హనుమకొండలో : 19
•పరకాలలో : 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన ధ్రువపత్రాలు (Scanned Copies)

1. పుట్టిన తేది/ వయస్సు ధృవీకరణపత్రము (SSC Certificate). 2. కుల ధృవీకరణపత్రము తహసిల్దార్చి ధ్రువీకరించి ఉండాలి. 3. విద్యార్హత ధృవీకరణపత్రము. 4. నివాస ధృవీకరణపత్రము. తహసిల్దార్ చే ద్రువీకరించి ఉండాలి. 5. అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణపత్రము. 7. అనాథ అయితే అనాథ సర్టిఫికేట్

అభ్యర్ధులకు ముఖ్యమైన సూచనలు : ఆన్లైన్ తప్పనిసరి: మ్యాన్యువల్, తపాలా (Post), ఈ-మెయిల్ లేదా ప్రజావాణి /CDPO/DWO

కార్యాలయాల్లో నేరుగా ఇచ్చే దరఖాస్తులు స్వీకరించబడవు. ఆన్లైన్ దరఖాస్తు & పూర్తి వివరాల కోసం వెబ్సైట్: http://wdcw.tg.nic.in నందు చూడగలరు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు పరచటానికి గానీ, మార్పులు చేయడానికిగానీ జిల్లా కలెక్టర్/ ఛైర్మన్ గారికి పూర్తి అధికారం కలదు.

దరఖాస్తు ముఖ్యమైన తేదీలు : అభ్యర్థులు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 6, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here

🛑 Vacancy List Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *