జిల్లా కోర్టులో ఉద్యోగాలు.. 7వ తరగతి, డిగ్రీ అర్హతతో ఛాన్స్ |District Court Jobs
జిల్లా కోర్టులో ఉద్యోగాలు.. 7వ తరగతి, డిగ్రీ అర్హతతో ఛాన్స్ | District Court Jobs
District Court Jobs 2026 Office Assistant Peon : ములుగు జిల్లా న్యాయ సేవల అథారిటీ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్, ఆఫీస్ ప్యూన్ (మున్షీ/అటెండెంట్) పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు.
ఈ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ నంబర్ 01/2026ను 22 సెప్టెంబర్ 2026న విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 5, 2026 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు ఈ నియామకంలో మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఒక ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టు, ఒక ఆఫీస్ ప్యూన్ (మున్షీ/అటెండెంట్) పోస్టు ఉన్నాయి. ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.20,000 వేతనం చెల్లిస్తారు. ఆఫీస్ ప్యూన్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.14,000 చెల్లిస్తారు. ఈ పోస్టులు మొదట ఒక సంవత్సరం కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. సంతృప్తికరమైన పనితీరు ఉంటే నిబంధనల ప్రకారం సేవను పొడిగించే అవకాశం ఉంటుంది.
ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుకు అర్హత : ఆఫీస్ అసిస్టెంట్/క్లర్క్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ను ఆపరేట్ చేయడం, ప్రాథమిక వర్డ్ ప్రాసెసింగ్‌పై అవగాహన ఉండాలి. అలాగే నిమిషానికి కనీసం 40 పదాల టైపింగ్ వేగం, డిక్టేషన్ తీసుకోవడం, డేటా ఎంట్రీ చేయడం, ఫైళ్లను నిర్వహించడం వంటి నైపుణ్యాలు ఉండాలి.
ఆఫీస్ ప్యూన్ పోస్టుకు అర్హత : ఆఫీస్ ప్యూన్ (మున్షీ/అటెండెంట్) పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచడం, అవసరమైన వస్తువులు తీసుకురావడం, సందర్శకులకు అవసరమైన సహాయం అందించడం వంటి సాధారణ కార్యాలయ విధులను నిర్వహించాల్సి ఉంటుంది.
వయో పరిమితి : 01 సెప్టెంబర్ 2026 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC, EWS అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. శారీరక వైకల్యం ఉన్న అభ్యర్థులకు 10 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
ఏ పత్రాలు కావాలి : దరఖాస్తుతో పాటు విద్యార్హతలకు సంబంధించిన మార్కుల మెమోలు, ఉత్తీర్ణత ధ్రువపత్రాలు, తాత్కాలిక ధ్రువపత్రాలు, ఇతర సంబంధిత సర్టిఫికెట్లు జత చేయాలి. అలాగే పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం మరియు SC/ST/BC/EWS అభ్యర్థులు సంబంధిత అధికారితో జారీ చేయబడిన కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
ఎలా దరఖాస్తు చేయాలి : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు విధానం లేదు. అభ్యర్థులు నోటిఫికేషన్లో ఇచ్చిన దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, తాము దరఖాస్తు చేస్తున్న పోస్టును స్పష్టంగా పేర్కొనాలి. పూర్తి చేసిన దరఖాస్తును సీల్ చేసిన కవరులో చైర్పర్సన్, జిల్లా న్యాయ సేవల అథారిటీ, ములుగు, కోర్ట్ కాంప్లెక్స్ చిరునామాకు పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలి.
దరఖాస్తులను నేరుగా లేదా వ్యక్తిగతంగా స్వీకరించరు. 05 అక్టోబర్ 2026 సాయంత్రం 5 గంటల తర్వాత అందే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రతి పోస్టుకు ప్రత్యేకంగా దరఖాస్తు సమర్పించాలి.
ఎంపిక విధానం :: అందిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాత జిల్లా న్యాయ సేవల అథారిటీ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఎంపిక విధానాన్ని దరఖాస్తుల సంఖ్య, పరిస్థితులను బట్టి అధికారులు నిర్ణయిస్తారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించి అధికారుల నిర్ణయమే తుది నిర్ణయంగా ఉంటుంది. కేవలం దరఖాస్తు చేసినంత మాత్రాన ఉద్యోగం లభిస్తుందని హక్కు ఉండదు.
ముఖ్యమైన తేదీ
•దరఖాస్తులకు చివరి తేదీ: 05 అక్టోబర్ 2026 చివరి సమయం: సాయంత్రం 5:00 గంటలు
అభ్యర్థులు దరఖాస్తు పంపే ముందు అధికారిక నోటిఫికేషన్‌లోని అన్ని నిబంధనలు, దరఖాస్తు ఫార్మాట్, చిరునామాను ఒకసారి పూర్తిగా పరిశీలించడం మంచిది.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
