Central Government Jobs

ICAR-IIOR హైదరాబాద్‌లో ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిప్లొమా, డిగ్రీ అర్హతతో అవకాశం

ICAR-IIOR హైదరాబాద్‌లో ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిప్లొమా, డిగ్రీ అర్హతతో అవకాశం

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICAR IIOR Hyderabad Jobs 2026 Walk In Interview : హైదరాబాద్‌లోని ఐసిఎఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ (ICAR-IIOR)లో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ మిషన్ ఆన్ హై యీల్డింగ్ సీడ్స్ (NMHYS) ప్రాజెక్టులో భాగంగా ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు :NMHYS సెసేమ్ ప్రాజెక్టులో రెండు ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ అక్టోబర్ 6, 2026న నిర్వహించనున్నారు. అగ్రికల్చర్‌లో డిప్లొమా చేసినవారు అర్హులు. లేదా వ్యవసాయ పరిశోధన కార్యకలాపాల్లో రెండేళ్ల అనుభవంతో ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.22,500 ఏకీకృత వేతనం చెల్లిస్తారు. పంటల పెంపకం, విత్తనోత్పత్తిలో అనుభవం, కంప్యూటర్, MS Officeపై అవగాహన ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు.

ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు : NMHYS సన్‌ఫ్లవర్ ప్రాజెక్టులో నాలుగు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అక్టోబర్ 8, 2026న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అగ్రికల్చర్‌లో డిప్లొమా చేసినవారు అర్హులు. అలాగే క్షేత్ర ప్రయోగాలు, ప్రయోగాత్మక ప్లాట్ల నిర్వహణ, డేటా రికార్డింగ్, డేటా ఎంట్రీ, సెల్ఫింగ్, క్రాసింగ్ వంటి వ్యవసాయ పరిశోధన కార్యకలాపాల్లో రెండేళ్ల అనుభవం ఉన్న గ్రాడ్యుయేట్లు కూడా అర్హులు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.22,500 వేతనం లభిస్తుంది. కంప్యూటర్, MS Officeపై పని పరిజ్ఞానం ఉండటం అదనపు అర్హతగా పేర్కొన్నారు.

వయోపరిమితి : అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 45 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన విషయం : ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలిక, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. ప్రస్తుతం ప్రాజెక్ట్‌కు మంజూరైన కాలం 2027 మార్చి 31 వరకు ఉంది. ప్రాజెక్ట్ అవసరం, నిధుల లభ్యత, అభ్యర్థి పనితీరును బట్టి సేవలను కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్రాజెక్ట్ పూర్తైన తర్వాత ఈ ఉద్యోగం ఆధారంగా ICAR-IIORలో శాశ్వత ఉద్యోగాన్ని కోరే హక్కు ఉండదు.

వాక్-ఇన్ ఇంటర్వ్యూకు ఎలా హాజరు కావాలి :అభ్యర్థులు సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు, ధృవీకరించిన జిరాక్స్ కాపీలు, అవసరమైన కుల ధృవీకరణ పత్రాలు, ఫోటో, పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారంతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు NOC తీసుకురావాలి.

ల్యాబొరేటరీ అసిస్టెంట్: 06 అక్టోబర్ 2026
ఫీల్డ్ అసిస్టెంట్: 08 అక్టోబర్ 2026

రెండు తేదీల్లోనూ అభ్యర్థులు ఉదయం 9:30 గంటలకు ICAR-IIOR, రాజేంద్రనగర్, హైదరాబాద్ వద్ద హాజరై 10:30 గంటలలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి TA/DA లేదా వసతి సౌకర్యం ఉండదు. ప్రారంభ పోస్టింగ్ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాల్లో కూడా పని చేయాల్సి రావచ్చు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *