Central Government Jobs

పదో తరగతి అర్హతతో 24 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు | CSIR NCL Recruitment 2026

పదో తరగతి అర్హతతో 24 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు | CSIR NCL Recruitment 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NCL Multi Tasking Staff (MTS)Recruitment 2026 Apply Now: పదో తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. పుణెలోని సీఎస్ఐఆర్‌-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (CSIR-NCL) సంస్థ 24 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన వివరాలు

సంస్థ: సీఎస్ఐఆర్‌-నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ, పుణె

పోస్టుల పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)

మొత్తం ఖాళీలు: 24

విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు.

దరఖాస్తు చివరి తేదీ: 04 నవంబర్ 2026.

దరఖాస్తు లింక్: [https://recruit.ncl.res.in/](https://recruit.ncl.res.in/)

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అభ్యర్థులకు ఓఎంఆర్ లేదా కంప్యూటర్ ఆధారిత విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఉంటుంది.

జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి, కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు రెండేళ్లపాటు ప్రొబేషన్‌లో పనిచేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు ఎంత : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత ఉన్న అభ్యర్థులు CSIR-NCL అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అధికారిక నోటిఫికేషన్‌లో విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించి, అవసరమైన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ సమర్పించాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *