Telangana Jobs

AIESL రంగంలో అసిస్టెంట్ Supervisor ఉద్యోగాలు.. నెలకు ₹47,625 వరకు జీతం | AIESL Recruitment 2026

AIESL రంగంలో అసిస్టెంట్ Supervisor ఉద్యోగాలు.. నెలకు ₹47,625 వరకు జీతం | AIESL Recruitment 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AIESL Assistant Supervisor Recruitment 2026 Apply Now : AI Engineering Services Limited (AIESL) నుంచి Regional Security Officer, Assistant Supervisor (Security) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 3, 2026లోపు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలు ఐదేళ్ల ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి.

ఈ నోటిఫికేషన్ ద్వారా Regional Security Officer పోస్టుకు ఒక ఖాళీ, Assistant Supervisor (Security) పోస్టులకు 10 ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగాలు చెన్నై, తిరువనంతపురం, ముంబై, కోల్‌కతా ప్రాంతాల్లో ఉన్నాయి. చెన్నైలో Assistant Supervisor పోస్టుకు మహిళలు మాత్రమే, మిగిలిన పేర్కొన్న ప్రాంతాల్లో పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

AIESL Recruitment 2026 Overview

AI Engineering Services Limited (AIESL)లో Regional Security Officer, Assistant Supervisor (Security) పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 11 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 3, 2026లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ: AI Engineering Services Limited (AIESL)
మొత్తం ఖాళీలు: 11
పోస్టులు: Regional Security Officer, Assistant Supervisor (Security)
విద్యార్హత: ఏదైనా డిగ్రీ
జీతం: నెలకు ₹27,940 – ₹47,625
ఉద్యోగ ప్రాంతాలు: చెన్నై, తిరువనంతపురం, ముంబై, కోల్‌కతా
ఎంపిక విధానం: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటరాక్షన్
దరఖాస్తు విధానం: పోస్టు / స్పీడ్ పోస్టు / కొరియర్
చివరి తేదీ: 3 నవంబర్ 2026
ఉద్యోగ విధానం: ఐదేళ్ల ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్

విద్యార్హతలు : Regional Security Officer పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం మూడేళ్ల డిగ్రీతో పాటు ఐదేళ్ల సెక్యూరిటీ సూపర్‌వైజరీ అనుభవం ఉండాలి. అలాగే చెల్లుబాటయ్యే BCAS Basic AVSEC సర్టిఫికెట్ తప్పనిసరి.

Assistant Supervisor (Security) పోస్టులకు కూడా డిగ్రీ అర్హత అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు కనీసం ఏడాది సెక్యూరిటీ సూపర్‌వైజరీ అనుభవం, చెల్లుబాటయ్యే BCAS Basic AVSEC సర్టిఫికెట్ ఉండాలి. మిగిలిన ఖాళీలను డిగ్రీ పూర్తి చేసిన ఫ్రెషర్లు లేదా మాజీ సైనికులతో భర్తీ చేసే అవకాశం ఉంది. అభ్యర్థులకు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి. BCAS సర్టిఫికెట్‌కు 2026 డిసెంబర్ 1 నాటికి కనీసం మూడు నెలల చెల్లుబాటు ఉండాలి.

వయోపరిమితి : 2026 అక్టోబర్ 1 నాటికి Regional Security Officer పోస్టుకు గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు, Assistant Supervisor పోస్టుకు 35 ఏళ్లు. SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు, OBC అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

జీతం ఎంత :Regional Security Officer పోస్టుకు నెలకు ₹47,625, Assistant Supervisor (Security) పోస్టుకు నెలకు ₹27,940 చెల్లిస్తారు. అర్హత కలిగిన BCAS Basic AVSEC సర్టిఫికెట్ ఉన్నవారికి నెలకు అదనంగా ₹2,000 అలవెన్స్ కూడా అందుతుంది.

ఎంపిక విధానం : అభ్యర్థులను రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ప్రీ-ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ పరీక్షలో అర్హత సాధించాలి. ఉద్యోగ నియామకం ఐదేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది. కంపెనీ అవసరాలు, పనితీరును బట్టి కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంది.

దరఖాస్తు విధానం : అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేసి, సంతకం చేసి, అవసరమైన విద్యార్హతలు, అనుభవం, ఇతర సర్టిఫికెట్ల స్వీయ ధ్రువీకరించిన ప్రతులను జతచేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్‌ను కూడా నోటిఫికేషన్ సూచనల ప్రకారం జతచేసి పోస్టు, స్పీడ్ పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా :
Chief Human Resources Officer, AI Engineering Services Limited, Personnel Department, 2nd Floor, CRA Building, Safdarjung Airport Complex, Aurobindo Marg, New Delhi – 110003.

చివరి తేదీ : 3 నవంబర్ 2026, సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేరాలి.

🛑Notification Pdf Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *