ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో 22 ఉద్యోగాలు.. డిప్లొమా, ITI అర్హతతో అప్లై చేసుకోండి
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో 22 ఉద్యోగాలు.. డిప్లొమా, ITI అర్హతతో అప్లై చేసుకోండి
ISRO IPRC RECRUITMENT 2026 : ఇస్రోలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)కు చెందిన ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ (IPRC), మహేంద్రగిరి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, కుక్, ఫైర్‌మ్యాన్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ISRO IPRC Recruitment 2026 ముఖ్యమైన వివరాలు
• సంస్థ : ISRO – IPRC
• ఉద్యోగాల సంఖ్య : 22
• ఉద్యోగ స్థలం : మహేంద్రగిరి, తమిళనాడు
• పోస్టులు : టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, కుక్, ఫైర్‌మ్యాన్
• అర్హత : డిప్లొమా, 10వ తరగతి, ITI, సంబంధిత అనుభవం
• దరఖాస్తు విధానం : ఆన్లైన్
• దరఖాస్తు ప్రారంభం : 15 సెప్టెంబర్ 2026
• చివరి తేదీ : 24-10-2026, 17:00 Hrs
• అధికారిక వెబ్సైట్ : www.iprc.gov.in
పోస్టుల వివరాలు : ఈ నోటిఫికేషన్లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఆటోమొబైల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ బి విభాగంలో టర్నర్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్లకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు కుక్, ఫైర్‌మ్యాన్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు
• టెక్నికల్ అసిస్టెంట్: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉండాలి.
• టెక్నీషియన్ బి: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI, NCVT జారీ చేసిన NTC లేదా NAC సర్టిఫికెట్ ఉండాలి.
• కుక్: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ప్రముఖ హోటల్ లేదా క్యాంటీన్లో కుక్‌గా ఐదేళ్ల అనుభవం అవసరం.
• ఫైర్‌మ్యాన్: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నోటిఫికేషన్లో పేర్కొన్న శారీరక ప్రమాణాలు, వైద్య అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయోపరిమితి : టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, కుక్ పోస్టులకు 2026 అక్టోబర్ 5 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఫైర్‌మ్యాన్ పోస్టుకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. SC/ST అభ్యర్థులకు ఐదేళ్లు, OBC అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు వర్తిస్తుంది. ఇతర వర్గాలకు సంబంధించిన నిబంధనలను అధికారిక నోటిఫికేషన్లో చూడాలి.
జీతం ఎంత : పోస్టును బట్టి పే లెవల్, జీతం మారుతుంది.
• టెక్నికల్ అసిస్టెంట్: పే లెవల్ 7, నెలకు ₹44,900 ప్రారంభ ప్రాథమిక వేతనం.
• టెక్నీషియన్ బి: పే లెవల్ 3, నెలకు ₹21,700 ప్రారంభ ప్రాథమిక వేతనం.
• కుక్: పే లెవల్ 2, నెలకు ₹19,900 ప్రారంభ ప్రాథమిక వేతనం.
వీటికి వర్తించే నిబంధనల ప్రకారం DA, HRA, రవాణా భత్యం వంటి ఇతర అలవెన్సులు అదనంగా లభించవచ్చు.
ఎంపిక విధానం : టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, కుక్ పోస్టులకు రాత పరీక్షతో పాటు సంబంధిత నైపుణ్య పరీక్ష ఉంటుంది. నైపుణ్య పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో రాత పరీక్ష మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
ఫైర్‌మ్యాన్ పోస్టుకు రాత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించాలి.
దరఖాస్తు ఫీజు : టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ₹750 దరఖాస్తు రుసుము, ఇతర పేర్కొన్న పోస్టులకు ₹500 రుసుము నిర్ణయించారు. చెల్లింపు నిబంధనలు, రుసుము తిరిగి చెల్లింపు అర్హతల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
ఎలా అప్లై చేయాలి : ముందుగా అధికారిక వెబ్సైట్ www.iprc.gov.in ఓపెన్ చేయండి. Careers విభాగంలో IPRC Recruitment 2026 నోటిఫికేషన్‌ను ఎంచుకోండి. మీ విద్యార్హతకు సరిపోయే పోస్టును పరిశీలించండి. దరఖాస్తు చేయడానికి ముందు పోస్టుల వారీగా అర్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్, పరీక్షా విధానం, ఫీజు రిఫండ్ నిబంధనలు అధికారిక నోటిఫికేషన్లో తప్పనిసరిగా తనిఖీ చేయండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
