Central Government Jobs

యూనివర్సిటీలో 126 అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Delhi University Recruitment 2026

యూనివర్సిటీలో 126 అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Delhi University Recruitment 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Delhi University Recruitment 2026 Assistant & Senior Assistant Notification 2026 Apply Now : ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్యోగం పొందాలనుకునే డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులకు శుభవార్త. యూనివర్సిటీ తాజాగా సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 126 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, పని అనుభవం ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Delhi University Recruitment 2026 Overview

సంస్థ పేరు : ఢిల్లీ యూనివర్సిటీ
నోటిఫికేషన్ నంబర్ : R&P/323/2026
ప్రకటన తేదీ : 19 అక్టోబర్ 2026 |
మొత్తం ఖాళీలు : 126
పోస్టుల పేర్లు : సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్
విద్యార్హత : బ్యాచిలర్ డిగ్రీ
ఉద్యోగ స్థలం : ఢిల్లీ
దరఖాస్తు విధానం :  ఆన్‌లైన్
చివరి తేదీ : 09 నవంబర్ 2026

పోస్టుల వివరాలు : ఈ నియామకంలో సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 46, అసిస్టెంట్ పోస్టులు 80 ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హత, అనుభవానికి అనుగుణంగా సంబంధిత పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.

అర్హతలు

సీనియర్ అసిస్టెంట్ : ఈ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా పే లెవల్-4లో అసిస్టెంట్ లేదా సమాన హోదాలో కనీసం మూడేళ్ల పని అనుభవం అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ రంగ సంస్థలు లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలకు సరిపోయే ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ బ్యాంకుల్లో అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ అప్లికేషన్లు, నోటింగ్, డ్రాఫ్టింగ్ వంటి పనుల్లో నైపుణ్యం ఉండాలి.

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు.

జీతం : 7వ వేతన సంఘం పే లెవల్-06 ప్రకారం వేతనం, వర్తించే అలవెన్సులు లభిస్తాయి.

అసిస్టెంట్  : అసిస్టెంట్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ లేదా సమానమైన పోస్టులో కనీసం రెండేళ్ల పని అనుభవం అవసరం. యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలకు సరిపోయే ప్రైవేట్ కంపెనీలు లేదా కార్పొరేట్ బ్యాంకుల్లో అనుభవం ఉన్నవారు అర్హులు కావచ్చు.

అలాగే ఇంగ్లీష్ టైపింగ్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 పదాల వేగం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్లపై అవగాహన అవసరం.

గరిష్ట వయస్సు:32 సంవత్సరాలు.

జీతం: 7వ వేతన సంఘం పే లెవల్-04 ప్రకారం వేతనం, వర్తించే అలవెన్సులు లభిస్తాయి.

దరఖాస్తు ఫీజు

• జనరల్ / అన్‌రిజర్వుడ్ : ₹1,000/-
• OBC-NCL / EWS / మహిళలు :  ₹800/-
• SC / ST / PwBD : ₹600/-

గతంలో ప్రకటన నంబర్ R&P/311/2024, తేదీ 12 డిసెంబర్ 2024 ద్వారా ప్రకటించిన సీనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం ఫీజు మినహాయింపు ఉంటుంది. ఒకసారి చెల్లించిన ఫీజు తిరిగి ఇవ్వరు.

వయోపరిమితిలో సడలింపు : SC, ST, OBC, దివ్యాంగులు, మాజీ సైనికులు తదితర అర్హులైన వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇతర ప్రత్యేక సడలింపులకు పూర్తి నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.

దరఖాస్తు ఎలా చేయాలి : అర్హులైన అభ్యర్థులు ఢిల్లీ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.du.ac.in ను సందర్శించాలి. అక్కడ ‘Advertisements – Departments’ విభాగంలో ‘Work with DU’ ఎంపికపై క్లిక్ చేసి సంబంధిత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను చూడాలి. అర్హతలు, అనుభవం, వయస్సు, ఫీజు వివరాలను పరిశీలించిన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేసి, అవసరమైన పత్రాలను సమర్పించాలి.

ముఖ్యమైన తేదీ : దరఖాస్తులకు 09 నవంబర్ 2026 చివరి తేదీగా ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురించిన తేదీ నుంచి రెండు వారాల గడువు దీనికంటే ఆలస్యంగా ఉంటే, నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధన వర్తిస్తుంది. కాబట్టి చివరి తేదీని అధికారిక వెబ్‌సైట్‌లో నిర్ధారించుకోండి.

ముఖ్యమైన లింకులు : అధికారిక వెబ్‌సైట్: https://www.du.ac.in/నోటిఫికేషన్, ఆన్‌లైన్ దరఖాస్తు: అధికారిక వెబ్‌సైట్‌లోని ‘Work with DU’ విభాగాన్ని సందర్శించండి.

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *