10th అర్హతతో అంతరిక్ష పరిశోధనా సంస్థ లో MTS & డ్రైవర్ ఉద్యోగాల నోటిఫికేషన్ || Latest ISRO SDSC Job Recruitment 2026 Apply Now
10th అర్హతతో అంతరిక్ష పరిశోధనా సంస్థ లో MTS & డ్రైవర్ ఉద్యోగాల నోటిఫికేషన్ || Latest ISRO SDSC Job Recruitment 2026 Apply Now
Latest ISRO SDSC Recruitment 2026 Latest Technician, Technical Assistant, MTS & Driver Job Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ఆధ్వర్యంలోని భారతదేశ అంతరిక్ష కేంద్రం అయిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట (SDSC SHAR) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వివిధ టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ ‘ఎ’, నర్స్ ‘బి’, టెక్నీషియన్ ‘బి’/ డ్రాఫ్ట్స్‌మ్యాన్ ‘బి’, ఫైర్‌మ్యాన్ ‘ఎ’, ఎల్‌విడి ‘ఎ’ & హెచ్‌విడి ‘ఎ’, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 09 నవంబర్ 2026 లోపల https://www.isro.gov.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట (SDSC SHAR) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. మెట్రిక్యులేషన్ (SSC) లేదా దానికి సమానమైన అర్హతలో ఉత్తీర్ణత, 10+2, డిప్లమా, బి.ఎస్.సి. మరియు బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 35 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://www.isro.gov.in/ లో ఆన్లైన్ లో 09 నవంబర్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, శ్రీహరికోట (SDSC SHAR) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను విభాగాల వారీగా ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 టెక్నికల్ అసిస్టెంట్ – మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్.
🔹 సైంటిఫిక్ అసిస్టెంట్ – ఫిజిక్స్, ఫైన్ ఆర్ట్స్ (ఫోటోగ్రఫీ)/ విసుఅల్ ఆర్ట్స్ (సినిమాటోగ్రఫీ).
🔹లైబ్రరీ అసిస్టెంట్ ‘A’
🔹నర్స్ ‘B’
🔹టెక్నీషియన్ ‘B’ – ఎలక్ట్రీషియన్, కెమికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ (R & AC), సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్, ఫోటోగ్రఫీ/ డిజిటల్ ఫోటోగ్రఫీ.
🔹డ్రాఫ్ట్స్మ్యాన్ ‘B’ – సివిల్
🔹ఫైర్మెన్ ‘A’
🔹లైట్ వెహికల్ డ్రైవర్ ‘A’
🔹హెవీ వెహికల్ డ్రైవర్ ‘A’
🔹మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)
మొత్తం 97 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు : సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
🔹 సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి బి.ఎస్.సి. మరియు బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత పొంది ఉండాలి.
🔹లైబ్రరీ అసిస్టెంట్ ‘A’ పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి లైబ్రరీ సైన్స్ / లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా దానికి సమానమైన ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
🔹నర్స్ ‘B’ పోస్టులకు : ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ నర్సింగ్ కనీసం మూడు సంవత్సరాల వ్యవధి గల కోర్సు, రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. (నర్సింగ్ అర్హత సంబంధిత రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్‌లో నమోదు చేయబడి ఉండాలి).
🔹టెక్నీషియన్ ‘B’ పోస్టులకు : పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ITI, NTC లేదా NAC వంటి నిర్దేశిత అర్హతలు ఉండాలి.
🔹డ్రాఫ్ట్స్మన్ ‘B’ పోస్టులకు : SSLC / SSC ఉత్తీర్ణత + ITI / NTC / NAC డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) ట్రేడ్ నుండి
NCVT.
🔹ఫైర్మన్ ‘A’ పోస్టులకు : SSLC/SSC / మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత, ఇతర నిబంధనలు పాటించాలి. నిర్దేశించిన శారీరక దృఢత్వ ప్రమాణాలు మరియు ఓర్పు పరీక్ష ప్రమాణాలను కలిగి ఉండాలి.
🔹లైట్ వెహికల్ డ్రైవర్ ‘A’ & హెవీ వెహికల్ డ్రైవర్ ‘A’ పోస్టులకు : SSLC/SSC / మెట్రిక్/10వ తరగతి ఉత్తీర్ణత, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, అవసరమైన డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
🔹మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు : మెట్రిక్యులేషన్ / SSLC /SSC లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹పోస్టులను అనుసరించి 35 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹 టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ ‘A’, నర్స్ ‘B’ పోస్టులకు – నెల జీతం రూ. 71840/- (బేసిక్ పే + డిఏ) భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం హెచ్ఆర్ఏ & రవాణా భత్యం
🔹 ఫైర్మెన్ ‘A’, డ్రాఫ్ట్స్మ్యాన్ ‘బి’ పోస్టులకు – నెల జీతం రూ.34720/- (బేసిక్ పే + డిఏ) భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం హెచ్ఆర్ఏ & రవాణా భత్యం
🔹 టెక్నీషియన్ ‘B’, LVD ‘A’, HVD ‘A’ పోస్టులకు – నెల జీతం రూ.31840/- (బేసిక్ పే + డిఏ) భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం హెచ్ఆర్ఏ & రవాణా భత్యం
🔹 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు – నెల జీతం రూ.28800/- (బేసిక్ పే + డిఏ) భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం హెచ్ఆర్ఏ & రవాణా భత్యం
🔹నియామకంపై ఎంపికైన అభ్యర్థులు జాతీయ పింఛను వ్యవస్థ/ఏకీకృత పింఛను పథకం పరిధిలోకి వస్తారు. ఇస్రో తన ఉద్యోగులకు, వారికి మరియు వారిపై ఆధారపడిన వారికి వైద్య సౌకర్యాలు, క్యాంటీన్ సౌకర్యం, గ్రంథాలయ సౌకర్యం, ఉచిత రవాణా (రవాణా భత్యానికి బదులుగా), గృహ వసతి సౌకర్యం (HRAకు బదులుగా), లీవ్ ట్రావెల్ కన్సెషన్, గ్రూప్ ఇన్సూరెన్స్, గృహ నిర్మాణ అడ్వాన్స్ మొదలైన ఆకర్షణీయమైన ప్రయోజనాలను ప్రస్తుత నిబంధనల ప్రకారం అందిస్తుంది.
🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
*టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ ‘A’, నర్స్ ‘B’ పోస్టులకు అభ్యర్థులందరూ ప్రతి దరఖాస్తుకు ప్రాసెసింగ్ ఫీజుగా ఏకరీతిగా రూ. 750/- (ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే) చెల్లించాలి. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు క్రింద వివరించిన విధంగా వాపసు ఇవ్వబడుతుంది :
దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు పొందిన అభ్యర్థులకు (మహిళలు, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు) రూ. 750/- అనగా పూర్తి వాపసు ఇవ్వబడుతుంది. రూ. 500/- అనగా, మిగిలిన అభ్యర్థులందరి దరఖాస్తు రుసుము రూ. 250/- మినహాయించిన తర్వాత తిరిగి చెల్లించబడుతుంది.
* మిగిలిన పోస్టులకు అభ్యర్థులందరూ ప్రతి దరఖాస్తుకు ప్రాసెసింగ్ ఫీజుగా ఏకరీతిగా రూ. 500/- (ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే) చెల్లించాలి. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మాత్రమే ప్రాసెసింగ్ ఫీజు క్రింద వివరించిన విధంగా వాపసు ఇవ్వబడుతుంది :
దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు పొందిన అభ్యర్థులకు (మహిళలు, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు) రూ. 500/- అనగా పూర్తి వాపసు. రూ. 400/- అనగా, మిగిలిన అభ్యర్థులందరి దరఖాస్తు రుసుము రూ. 100/- మినహాయించిన తర్వాత తిరిగి చెల్లించబడుతుంది.
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ : 09 నవంబర్ 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఎంపిక విధానం:
* పోస్టులను అనుసరించి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, హెవీ మరియు లైట్ వెహికల్ డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 09 నవంబర్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).
👉 అధికారిక వెబ్సైట్: https://www.isro.gov.in/
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

