Northern Railway Recruitment 2026: నార్తర్న్ రైల్వేలో అప్రెంటిస్ 4,651ఉద్యోగాలు.. 10th, ITI అర్హతతో అప్లై చేసుకోండి
Northern Railway Recruitment 2026: నార్తర్న్ రైల్వేలో అప్రెంటిస్ 4,651ఉద్యోగాలు.. 10th, ITI అర్హతతో అప్లై చేసుకోండి
Northern Railway Apprentice Recruitment 2026 : నార్తర్న్ రైల్వేలో ఉద్యోగం పొందాలనుకునే నిరుద్యోగ యువతకు మంచి అవకాశం వచ్చింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), నార్తర్న్ రైల్వే, న్యూఢిల్లీ విభాగం వివిధ ట్రేడుల్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో 4,651 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు అర్హతలు పరిశీలించి నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
ఉద్యోగాల వివరాలు: ఈ నియామక ప్రక్రియ ద్వారా మెకానిక్ (డీజిల్), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, స్టెనోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, కార్పెంటర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, టర్నర్ తదితర ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ అవకాశాలు కల్పించనున్నారు.

విద్యార్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగాన్ని బట్టి 10+2 లేదా ఐటీఐ అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు తాము ఎంపిక చేసుకునే ట్రేడ్‌కు సంబంధించిన విద్యార్హతలను అధికారిక నోటిఫికేషన్‌లో ఒకసారి పరిశీలించాలి.
వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 15 సంవత్సరాలు, గరిష్ఠంగా 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: ఈ అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థులను అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అంటే అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేసి ఎంపిక ప్రక్రియ చేపడతారు. పూర్తి ఎంపిక విధానం, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
దరఖాస్తు విధానం: ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా నార్తర్న్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ https://www.rrcnr.org/, https://www.rrcnr.org/ ను సందర్శించాలి. అక్కడ సంబంధిత అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఓపెన్ చేసి పూర్తి వివరాలు చదవాలి. అనంతరం ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అడిగిన వివరాలను నమోదు చేసి, అవసరమైన విద్యార్హత సర్టిఫికెట్లు మరియు ఇతర పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీ: నార్తర్న్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 11. కాబట్టి అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
ఇవి అప్రెంటిస్ శిక్షణ పోస్టులు మాత్రమే. వీటిని నేరుగా పర్మనెంట్ రైల్వే ఉద్యోగాలుగా భావించకూడదు. ఖాళీల సంఖ్య, శిక్షణ కాలం, స్టైపెండ్ తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
