Free Sewing Machines Scheme : మహిళలకు సువర్ణ అవకాశం వెంటనే అప్లై చేసుకోండి
Free Sewing Machines Scheme : మహిళలకు సువర్ణ అవకాశం వెంటనే అప్లై చేసుకోండి
Sewing Machines Indiramma Mahila Shakti Scheme : తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ క్రైస్తవ మైనారిటీల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద అర్హత కలిగిన మైనారిటీలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. ఈ పథకానికి జనవరి 20 చివరి తేదీగా నిర్ణయించారు.
నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు
• పథకం పేరు: ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ
• అధికారిక వెబ్‌సైట్: తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGFMFC)
• గడువు తేదీ: జనవరి 20, 2025
• లబ్ధిదారులు: నిరుద్యోగ మహిళలు
సంస్థ పేరు : తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGFMFC)
ఈ పథకం కింద ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు కానీ అర్హత కలిగిన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించినది.
అర్హతలు
• వయసు : 18-45 సంవత్సరాల మధ్య
• ఆదాయం : గ్రామీణ ప్రాంతాలు: రూ. 1.5 లక్షలు లోపు
• పట్టణ ప్రాంతాలు: రూ. 2 లక్షలు లోపు
• ప్రామాణిక పత్రాలు
• టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తప్పనిసరి
వయోపరిమితి
• కనిష్టం : 18 సంవత్సరాలు
• గరిష్టం : 45 సంవత్సరాలు
దరఖాస్తు విధానం
• ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం వంటి అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలి.
• టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తప్పనిసరి.
• TGFMFC అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్ళి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ పూరించాలి.
• ఫారమ్ పూరించిన తర్వాత ఎలాంటి హార్డ్ కాపీ సమర్పణ అవసరం లేదు.
దరఖాస్తు రుసుము
ఈ పథకం పూర్తిగా ఉచితం. దరఖాస్తు చేసుకోవడానికిగాను ఎటువంటి రుసుము అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ
ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయం నుంచి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మెసేజ్ వస్తుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
గడువు తేదీ : జనవరి 20, 2025
🛑Registration form Click Here
తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానం
1. ఈ పథకానికి ఎవరెవరు అర్హులు?
ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.5 లక్షలు లోపు ఆదాయం ఉన్నవారు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులు.
2. కుట్టు మిషన్ల కోసం ఎలాంటి ప్రామాణిక పత్రాలు అవసరం?
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, మరియు టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అవసరం.
3. హజ్ హౌస్‌కి వెళ్లాల్సి ఉందా?
అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది.
4. ఈ పథకం కోసం ఏదైనా రుసుము చెల్లించాలా?
ఈ పథకం పూర్తిగా ఉచితం. ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు