Andhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

CSIR Notification 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 

CSIR Notification 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 

CSIR Notification 2025 : యువత చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలలో స్థిరమైన ఉద్యోగం అనేది ఎంతో మందికి కలల లక్ష్యం గా ఉంటుంది. ఇటువంటి సమయాల్లో చెన్నైలోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన “CSIR Madras Complex” సంస్థ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తం ఖాళీలు 8 ఉన్నాయి. అవి… జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అభ్యర్థులకు ఇది ఒక అరుదైన అవకాశం.

సంస్థ పరిచయం :
సిఎస్ఐఆర్ (CSIR) అనగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఈ సంస్థ భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రముఖ పరిశోధన సంస్థ. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పరిశోధనలను జరుపుతూ శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే పనులలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సంస్థలో పనిచేసే అవకాశం అంటే శ్రేష్టతకు నిదర్శనం భద్రమైన భవిష్యత్తుకు నాంది.

»పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తం ఖాళీలు 8 ఉన్నాయి. అవి… జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔹జూనియర్ సెక్రటేరియట్  అసిస్టెంట్ (జనరల్) – 01
🔹 సెక్రటేరి యట్ అసిస్టెంట్ ( ఫైనాన్స్ & అకౌంట్స్) – 02
🔹జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( స్టోర్ & పర్చేజ్ ) – 01
🔹జూనియర్ స్టెనోగ్రాఫర్ – 04
ఈ పోస్టులు కార్యాలయ నిర్వహణలో ముఖ్యమైనవి. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ రకమైన ఉద్యోగాలు వెళ్తున్న పెంపొందించుకోవడానికి మేనేజ్మెంట్ విధానాలు నేర్చుకోవడానికి ఎంతో ఉపయోగకరం.

» అర్హత :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 లేదా దానికి సమానమైన విద్యార్హతను కలిగి ఉండాలి. అంటే ఇంటర్ లేదా దానికి సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలి. అదనంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు టైపింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉండడం తప్పనిసరి. ఇంగ్లీషులో ఎక్కువగా టైపింగ్ చేయాల్సి ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు అయితే, స్టెనో నైపుణ్యం తప్పనిసరి.

» వయసు :
20.05.2025 నాటికి అభ్యర్థుల వయసు…
🔹జూనియర్స్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు – గరిష్ట వయసు 28 ఏళ్లు.
🔹జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు – గరిష్ట వయసు 30 ఏళ్లు.
🔹SC ST OBC PWD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.

» వేతనం :
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి క్రింది విధంగా నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.
🔹జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు – నెల జీతం రూ.37,885 ( 7వ పే కమిషన్ ప్రకారం )
🔹జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు – నెల జీతం రూ. 45,900 చెల్లిస్తారు.( అనగా సంవత్సరానికి రూ. 5.51 లక్షలు ఇవ్వడం జరుగుతుంది.)
అభ్యర్థులకు నెల జీతంతో పాటు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దినసరి భత్యాలు, HRA, మెడికల్ ఫెసిలిటీస్, PF లాంటి ఇతర ప్రయోజనాలు ఉద్యోగ భద్రతను మరింతగా పెంచుతాయి. 

» ఎంపిక విధానం :
అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా చేయడం జరుగుతుంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా…
🔹ప్రొఫిషియన్సీ టెస్ట్ – టైపింగ్ / స్టెనో నైపుణ్యాల పై పరీక్ష.
🔹 రాత పరీక్ష  – జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ రీజనింగ్, మ్యాథ్స్ వంటి విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి.
ప్రతి దశలో విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులను తుది ఎంపిక జాబితాలోకి తీసుకుంటారు.

» దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు కోసం అధికారిక వెబ్సైట్ : https://www.csircmc.res.in

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది :
19.05.2025.
ఈ నియామక ప్రక్రియలో విజయం సాధించాలంటే సమయపాలనతో పాటు, ప్రాక్టీస్, ప్రిపరేషన్ ఎంతో అవసరం. టైపింగ్ నైపుణ్యం పెంపొందించుకోవడానికి రోజు కచ్చితంగా సమయం కేటాయించాలి. స్టెనోగ్రఫీ అభ్యర్థులు కూడా షార్ట్ హ్యాండ్ లో వేగాన్ని పెంచుకోవాలి. రాత పరీక్ష కోసం జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ గ్రామర్ వంటి అంశాల్లో సిద్ధంగా ఉండాలి.
ఈ ఉద్యోగాల ద్వారా ఒక స్థిరమైన జీవితం ప్రారంభించేందుకు మీ ప్రయాణం మొదలవుతుంది. మీ భవిష్యత్తు కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

🔷Official Notification PDF Click Here

🔷Online Apply Link Click Here

🔷Telegram Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!