Andhra Pradesh jobsGovernment JobsTelangana Jobs

Good News : ఇంటర్వ్యూ ఆధారంగా ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్లో 934 పోస్టులు.. మంచి జీతం 

Good News : ఇంటర్వ్యూ ఆధారంగా ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్లో 934 పోస్టులు.. మంచి జీతం 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NMDC Notification 2025 : ఇప్పటి తరుణంలో ఒక మంచి ఉద్యోగం సాధించడం చాలా మంది యువతకు ప్రధాన లక్ష్యం అయిపోయింది. అయితే మార్కెట్లో పోటీ ఎక్కువ కావడం, స్థిరమైన ఉద్యోగాల సంఖ్య తగ్గిపోవడం, ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆలస్యం అవ్వడం వంటి అంశాలు అభ్యర్థులకు పెద్ద సవాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టీల్ లిమిటెడ్ కొత్తగా విడుదల చేసిన 934 ఉద్యోగాల నోటిఫికేషన్ ఎంతోమంది అభ్యర్థులకు ఆశాజనకంగా మారనుంది.


అర్హతలు ఎన్ని ఉన్నా ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరకడం చాలా కష్టం అవుతుంది ఈ రోజుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో మనకి కొత్తగా విడుదలైన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్( NMDC) లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్(CE)పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య : 934.

» విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
• ఎలక్ట్రికల్
• మెకానికల్
•సివిల్
• మైనింగ్
• ఫైనాన్స్
• లాజిస్టిక్స్
• ల్యాబ్ టెక్నీషియన్
• హ్యూమన్ రిసోర్సెస్
• అడ్మినిస్ట్రేషన్
• ప్రొడక్షన్
ప్రతి విభాగంలో అనుభవం గల వారికి ఇవి మంచి అవకాశాలని చెప్పుకోవచ్చు. అనుభవంతో పాటు నైపుణ్యం ఉంటే ఇంటర్వ్యూలో ప్రతిభ చూపితే ఈ ఉద్యోగాలు వారి జీవితాన్నే మార్చే అవకాశం ఇది.

» అర్హత :
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో అభ్యర్థుల అర్హతలు ఎలా ఉన్నాయో చూద్దాం…

🔹ఇంజనీరింగ్ విభాగాలలో Btech, BE, డిప్లమా చేసిన వారు అర్హులు.
🔹 టెక్నికల్ విభాగాలలో ఐటిఐ చేసిన వారు అర్హులు.
🔹 ఫైనాన్స్ అకౌంటింగ్ విభాగాలలో CA చేసిన వారు అర్హులు.
🔹మేనేజ్మెంట్ విభాగాల్లో ఎంబీఏ లేదా పిజిడిఎం అర్హత సాధించిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔹 సైన్స్ లేదా ఆర్ట్స్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవే కాకుండా అభ్యర్థులు కనీసం కొన్ని సంవత్సరాల అనుభవం కూడా కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి అనుభవ సంవత్సరాలు మారవచ్చును.

» వయస్సు :
50 ఏళ్లు ఉండాలి. అనగా ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు ఇది చక్కని అవకాశం సాధారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో అభ్యర్థి వయస్సు తక్కువగా ఉండటం వల్ల ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి అవకాశం దక్కదు అయితే ఈ నోటిఫికేషన్ లో 50 ఏళ్ల వరకు అర్హత ఇవ్వడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

» వేతనం :
నెలకు పోస్ట్ కోడ్ CE – 2 నుంచి CE – 10 ఆధారంగా నెల జీతం రూ.40,000 నుండి రూ.1,70,000 వరకు చెల్లిస్తారు.
ఇది చాలా వరకు పోస్టులను అనుసరించి పోస్టు స్థాయి,  అభ్యర్థి అనుభవం, అర్హతల ఆధారంగా మారవచ్చు.
సాధారణంగా కాంట్రాక్ట్ ఉద్యోగాలకు వేతనం అంతగా ఉండదు. కానీ ఈ ఉద్యోగాలకు ప్రభుత్వ స్థిర ఉద్యోగాలకు సమానంగా నెల జీతం అందిస్తున్నారు కాబట్టి ఇది యువతకు మంచి అవకాశం.

» ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ఎటువంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు కాబట్టి మీ అనుభవం విద్యార్హతలను ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఉంటుంది.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తగినంతగా తమ అనుభవ పత్రాలు విద్యా సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి అంతేకాక పోస్ట్ కు సంబంధించిన టెక్నికల్ విషయాల్లో అనుభవాన్ని ధైర్యంగా వివరించగలగాలి.

» దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.

» దరఖాస్తులకు చివరితేది : 08.05.2025

» వెబ్సైట్ : https://nmdcsteel.nmdc.co.in
పై ఇచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసి రిక్రూట్మెంట్ సెక్షన్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం నింపవచ్చు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దానిని డౌన్లోడ్ చేసి భద్రంగా ఉంచుకోవాలి.

🔷Official Notification PDF Click Here

🔷Online Apply Link Click Here

🔷Telegram Link Click Here


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!