గ్రామీణ బ్యాంకులలో బ్యాంకులలో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ | Latest IBPS PO/MT Recruitment 2026 Apply Now
గ్రామీణ బ్యాంకులలో బ్యాంకులలో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ | Latest IBPS PO/MT Recruitment 2026 Apply Now
Latest IBPS Recruitment 2026 Latest PO/MT Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) సంస్థ ద్వారా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. పాల్గొనే ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రైనీల (PO/MT) పోస్టుల నియామకం మరియు ఎంపిక కొరకు జరగబోయే ఉమ్మడి నియామక ప్రక్రియ (CRP) కోసం ఆన్లైన్ పరీక్ష (ప్రిలిమినరీ మరియు మెయిన్)ను, క్రింద ఇవ్వబడిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తోంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 21 జూలై 2026 లోపల www.ibps.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రైనీ (PO/MT).. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 20 నుండి 30 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ www.ibps.in లో ఆన్లైన్ లో 21 జూలై 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రైనీ (PO/MT) మొత్తం 6715 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
* బ్యాంక్ ఆఫ్ బరోడా: 1,900 ఖాళీలు
* కెనరా బ్యాంక్: 1,500 ఖాళీలు
* బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 1,100 ఖాళీలు
* ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్: 550 ఖాళీలు
* పంజాబ్ నేషనల్ బ్యాంక్: 504 ఖాళీలు
* బ్యాంక్ ఆఫ్ ఇండియా: 500 ఖాళీలు
* సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: 500 ఖాళీలు
* పంజాబ్ & సింధ్ బ్యాంక్: 161 ఖాళీలు ఇవ్వడం జరిగింది.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రైనీ (PO/MT) : భారత ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్) లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన దానికి సమానమైన అర్హత. అభ్యర్థి, తాను రిజిస్టర్ చేసుకునే రోజు నాటికి గ్రాడ్యుయేట్ అని ధృవీకరించే చెల్లుబాటు అయ్యే మార్క్-షీట్ / డిగ్రీ సర్టిఫికేట్ను కలిగి ఉండాలి మరియు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు గ్రాడ్యుయేషన్లో పొందిన మార్కుల శాతాన్ని సూచించాలి.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹పోస్టులను అనుసరించి 30 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్మెంట్ ట్రైనీ (PO/MT) పోస్టులకు : నెలకు బేసిక్ పే రూ.48480-2000/7-62480-2340/2-67160-2680/7-85920 గా చెల్లిస్తారు.
పాల్గొనే బ్యాంకు యొక్క ఎప్పటికప్పుడు అమలులో ఉన్న నియమాల ప్రకారం అధికారి అలవెన్సులు & ప్రోత్సాహకాలకు అర్హులు.
🔷 దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు దారులు దరఖాస్తుతో పాటుఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల అభ్యర్థులకు రూ. 175/- (జీఎస్టీతో కలిపి). మిగతా అందరికీ రూ. 850/- (జీఎస్టీతో కలిపి) దరఖాస్తు ఫీజును చెల్లించవలసి ఉంటుంది.
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 21 జూలై 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఆన్లైన్ ప్రిలిమినరీ టెస్ట్, ఆన్లైన్ మెయిన్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, డాకుమెంట్స్ వెరిఫికేషన్(DV), మెడికల్ ఎగ్జామినేషన్(ME), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక పక్రియ నిర్వహిస్తారు.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 01 ఆగస్టు 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).
👉 అధికారిక వెబ్సైట్: www.ibps.in
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

