Telangana Jobs

జిల్లా మోడల్ స్కూల్ లో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో లైబ్రేరియన్ & టీచర్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోండి!

జిల్లా మోడల్ స్కూల్ లో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో లైబ్రేరియన్ & టీచర్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోండి!

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Siddipet District Model School Outsourcing basis Recruitment 2026 : సిద్దిపేట జిల్లాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మంచి అవకాశం వచ్చింది. జిల్లా అవుట్‌సోర్సింగ్ కమిటీ ఆధ్వర్యంలో వివిధ విభాగాల్లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 56 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్ట్ టీచర్, యోగా టీచర్, కంప్యూటర్ టీచర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 12, 2026న ప్రారంభమై నవంబర్ 17, 2026తో ముగుస్తుంది. ఆసక్తి ఉన్నవారు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకోవడం మంచిది.

విద్యార్హతలు

ఆర్ట్ టీచర్: అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, కమర్షియల్ ఆర్ట్స్, ప్రింట్ మేకింగ్ లేదా యానిమేషన్ విభాగాల్లో సంబంధిత మాస్టర్స్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

యోగా టీచర్: ఏదైనా డిగ్రీతో పాటు యోగాలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి. లేదా యోగా స్పెషలైజేషన్‌తో బీపీఈడీ పూర్తి చేసినవారు అర్హులు.

కంప్యూటర్ టీచర్: కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ విభాగంలో మాస్టర్స్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉండాలి.

లైబ్రేరియన్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష నిర్వహించకుండా అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం ఆధారంగా మొత్తం 50 మార్కులకు మెరిట్ మార్కులు కేటాయిస్తారు. అనంతరం అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఆ తర్వాత తుది మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారు.

దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు

ఈ ఉద్యోగాలకు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

• నోటిఫికేషన్ జిల్లా  : సిద్దిపేట
• మొత్తం పోస్టులు  : 56
• దరఖాస్తు ప్రారంభం : 12-11-2026
• దరఖాస్తుకు చివరి తేదీ : 17-11-202
• అప్లికేషన్ విధానం  : ఆఫ్‌లైన్
• ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా

ఎలా అప్లై చేయాలి : అర్హత ఉన్న అభ్యర్థులు సిద్దిపేట జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి నోటిఫికేషన్, దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాల వివరాలను పరిశీలించాలి. అనంతరం సూచించిన విధంగా దరఖాస్తును సమర్పించాలి.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *