సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేశాయ్ ఇంటర్/12th తో రూ.45,000 జీతం…ఇప్పుడే Apply Online చేయండి | NITTTRC Junior Secretariat Assistant Recruitment 2026 | Gk 15 Telugu
సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు వచ్చేశాయ్ ఇంటర్/12th తో రూ.45,000 జీతం…ఇప్పుడే Apply Online చేయండి | NITTTRC Junior Secretariat Assistant Recruitment 2026 | Gk 15 Telugu
Latest NITTTRC Junior Secretariat Assistant Notification 2026 Apply Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వివిధ టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ I, సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్ II, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, Sr.సెక్రటేరియట్ అసిస్టెంట్, Jr.సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 16 నవంబర్ 2026 లోపల https://www.nitttrc.ac.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ గ్రూప్ బి & సి పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 40 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ https://www.nitttrc.ac.in లో ఆన్లైన్ లో 16 నవంబర్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (NITTTR) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను విభాగాల వారీగా ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ I (ఎడిటర్ – ETV)
🔹సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్ II (అడ్మిన్ & అకౌంట్స్)
🔹 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సీనియర్ ఆడిటర్)
🔹సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
🔹సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (సార్జెంట్)
🔹జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
మొత్తం 07 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ I పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగంలో బి.ఇ./బి.టెక్. పట్టాతో పాటు, నియామక నిబంధనలలో సూచించిన విధంగా 10 సంవత్సరాల సంబంధిత అనుభవం.(లేదా) స్కూల్ ఫైనల్/10వ తరగతి లేదా తత్సమాన విద్యతో పాటు, సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా మరియు 15 సంవత్సరాల సంబంధిత అనుభవం.
🔹సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్ II పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వ / స్వయంప్రతిపత్తి సంస్థలు / ప్రభుత్వ రంగ సంస్థలలో పే లెవల్-5 లేదా తత్సమాన హోదాలో 6 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
🔹అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.
🔹సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు : ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత ను కలిగి ఉండాలి.
🔹సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (సార్జెంట్) పోస్టులకు : ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత ను కలిగి ఉండాలి.
🔹జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు : 10వ తరగతి +2 లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఇంగ్లీషులో నిమిషానికి కనీసం 30 పదాల టైపింగ్ వేగం కలిగి ఉండాలి.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹పోస్టులను అనుసరించి 35 మరియు 40 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ I & సెక్షన్ ఆఫీసర్ గ్రేడ్ II పోస్టులకు : నెల జీతం పే లెవెల్ 6 : రూ. 35,400/- to రూ.1,12,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
🔹అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు : నెల జీతం పే లెవెల్ 5 : రూ.29,200/- to రూ.92,300/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
🔹సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & సార్జెంట్ పోస్టులకు : నెల జీతం పే లెవల్ 4 : రూ.25,500/- to రూ.81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
🔹జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు : నెల జీతం పే లెవల్ 2 : రూ.19,900/- to రూ.63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
జనరల్/ EWS/ OBC వర్గాల అభ్యర్థులు తిరిగి చెల్లించబడని రూ.500/- దరఖాస్తు రుసుమును కేవలం ఆన్లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి https://www.onlinesbi.sbi/sbicollect ఈ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత, సెర్చ్ బాక్స్‌లో NITTTR అని టైప్ చేసి, డ్రాప్‌డౌన్ మెనూ నుండి ‘రిక్రూట్మెంట్-అప్లికేషన్ ఫీజు’గా చెల్లింపు విభాగాన్ని ఎంచుకోండి). చెల్లించిన రుసుము రసీదును ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో అప్లోడ్ చేయాలి. SC/ ST/ దివ్యాంగులు (PwD)/ మహిళలు/ మాజీ సైనికులు/ ఈ సంస్థ యొక్క అంతర్గత అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. రుసుము మినహాయింపుకు అర్హత లేని దరఖాస్తుదారులు నిర్దేశించిన దరఖాస్తు రుసుమును తప్పనిసరిగా చెల్లించాలి. వర్తించే రుసుమును చెల్లించడంలో విఫలమైతే, నియామక ప్రక్రియలోని ఏ దశలోనైనా వారి అభ్యర్థిత్వం తిరస్కరించబడుతుంది.
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ : 16 నవంబర్ 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్‌కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
🔷 ఎంపిక విధానం (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఎంపిక విధానం:
* పోస్టులను అనుసరించి ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.
* రాత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష లేదా OMR ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది. సంబంధిత పోస్టులకు సంబంధించిన రాత/నైపుణ్య పరీక్ష యొక్క సిలబస్ మరియు పరీక్షా విధానం వెబ్సైట్లో అప్లోడ్ చేయబడతాయి.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 16 నవంబర్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).
👉 అధికారిక వెబ్సైట్: https://www.nitttrc.ac.in
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

