ఫీజు లేకుండానే జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమలో డైరెక్ట్ జాబ్స్ | DWCDA Social Counsellor Notification 2025
ఫీజు లేకుండానే జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమలో డైరెక్ట్ జాబ్స్ | DWCDA Social Counsellor Notification 2025
DWCDA Social Counsellor Notification 2025 : జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము లో Social Counsellor గా నోటిఫికేషన్ జారీ చేయబడింది. ఈ నియామకములు పూర్తిగా తాత్కాలికము మరియు ప్రభుత్వం వారిచే జారీ చేయబడు ఉత్తర్వుల మేరకు వారి పెర్ఫార్మన్స్ ఆధారముగా వారి యొక్క సర్వీసు కొనసాగింపబడును.
అర్హత, నిర్ణయ ప్రమాణాలు మరియు దరఖాస్తు ఫారంలను https://kadapa.ap.gov.in వెబ్ సైట్ నుండి పొందగలరు. అర్హత మరియు నిర్ణయ ప్రమాణాల ప్రకారము అన్ని అర్హతలున్న అభ్యర్ధులు పూర్తి చేసిన దరఖాస్తులను సంబందిత దృవీకరణ పత్రములు జతపరచి ఈ నోటిఫికేషన్ ప్రచురితమైన దినము నుండి అనగా 01.02.2025 నుండి 15.02.2025వ తేది సాయంత్రం 05.00 గంటలలోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, డి-బ్లాక్, క్రొత్త కలెక్టరేట్, కడప, వై.యస్. ఆర్. జిల్లా యందు సమర్పించవలయును.

ఖాళీలు వివరాలు : ఈ పోస్ట్ కోసం నెలకు వేతనం రూ.35,000/- చెల్లించబడుతుంది.
విద్య అర్హత : సోషల్ కౌన్సెలర్ తప్పనిసరిగా మాస్టర్స్ డిగ్రీ సైకాలజీ/సోషల్ వర్క్ కలిగి ఉండాలి. కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉన్న సోషియాలజీతో పోస్ట్ గ్రాడ్యుయేట్‌లను కూడా పరిగణించవచ్చు. P.G తో సైకాలజీ/సోషియాలజీ లేదా సోషల్ వర్క్‌లో గ్రాడ్యుయేట్లు. కౌన్సెలింగ్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవంతో డిప్లొమా ఇన్ కౌన్సెలింగ్ అర్హత ఉంటుంది. కంప్యూటర్‌పై పని చేయగల సామర్థ్యం మరియు Ms-ఆఫీస్ ప్యాకేజీని ఉపయోగించగల సామర్థ్యం.
వయోపరిమితి : గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సడలింపు నిబందనల ప్రకారం వయసు సడలింపు ఉటుంది.
దరఖాస్తు విధానం : ఈ నోటిఫికేషన్ ప్రచురితమైన దినము నుండి అనగా 01.02.2025 నుండి 15.02.2025వ తేది సాయంత్రం 05.00 గంటలలోపు కార్యాలయ పని దినములు మరియు పని వేళల యందు జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయము, డి-బ్లాక్, క్రొత్త కలెక్టరేట్, కడప, వై.యస్. ఆర్. జిల్లా యందు సమర్పించవలయును.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here