AIIMS NORCET 8వ నోటిఫికేషన్ 2025 చివరి తేదీ ఈరోజు వెంటనే అప్లై చేసుకోండి
AIIMS NORCET 8వ నోటిఫికేషన్ 2025 చివరి తేదీ ఈరోజు వెంటనే అప్లై చేసుకోండి
AIIMS NORCET 8th Notification 2025 : ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET) 8వ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, నర్సింగ్ ఆఫీసర్ (గ్రూప్-B) పోస్టుల కోసం నియామక నోటిఫికేషన్ కి చివరి తేదీ ఈరోజే. ఆసక్తిగల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు 24 ఫిబ్రవరి 2025 నుండి 17 మార్చి 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియ ద్వారా, AIIMS నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి NORCET-8 నిర్వహిస్తోంది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, AIIMS వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పని చేయవచ్చు. అందువల్ల, అర్హత కలిగిన అభ్యర్థులు సమయానికి దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:
• ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 24 ఫిబ్రవరి 2025
• ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: 17 మార్చి 2025
• ప్రిలిమినరీ పరీక్ష తేదీ (CBT – స్టేజ్ 1): 12 ఏప్రిల్ 2025
• మెయిన్స్ పరీక్ష తేదీ (CBT – స్టేజ్ 2): 2 మే 2025
అర్హతలు: అభ్యర్థులు క్రింది అర్హతలలో ఒకటి కలిగి ఉండాలి:
• B.Sc. నర్సింగ్ : B.Sc. (హాన్స్.) నర్సింగ్ / B.Sc. నర్సింగ్ (ఇన్‌స్టిట్యూట్ / యూనివర్శిటీ గుర్తింపు పొందిన) లేదా B.Sc. (పోస్ట్-సర్టిఫికేట్) / పోస్ట్-బేసిక్ B.Sc. నర్సింగ్ (ఇన్‌స్టిట్యూట్ / యూనివర్శిటీ గుర్తింపు పొందిన) స్టేట్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్స్ & మిడ్‌వైఫ్‌గా నమోదు
• GNM (జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ) : జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ (GNM) డిప్లొమా (ఇన్‌స్టిట్యూట్ / బోర్డ్ గుర్తింపు పొందిన) స్టేట్ / ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో నర్స్ & మిడ్‌వైఫ్‌గా నమోదు. పై అర్హత పొందిన తర్వాత కనీసం 50 పడకల ఆసుపత్రిలో రెండు సంవత్సరాల అనుభవం
వయస్సు పరిమితి:
• కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
వయస్సు సడలింపు: OBC: 3 సంవత్సరాలు SC/ST: 5 సంవత్సరాలు PwBD: 10 సంవత్సరాలు. ఎక్స్-సర్వీస్మెన్: ప్రభుత్వ నియమాల ప్రకారం
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది:
• స్టేజ్ 1: NORCET ప్రిలిమినరీ (CBT) – 12 ఏప్రిల్ 2025
• స్టేజ్ 2: NORCET మెయిన్స్ (CBT) – 2 మే 2025
చివరి మెరిట్ జాబితా రెండు దశలలో అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం:
• AIIMS అధికారిక వెబ్‌సైట్ (aiimsexams.ac.in) సందర్శించండి.
• “నర్సింగ్ ఆఫీసర్ NORCET 8” పై క్లిక్ చేసి, ఇమెయిల్ & మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయండి.
• దరఖాస్తు ఫారమ్‌లో సరైన వివరాలు పూరించండి.
• దరఖాస్తును సమర్పించి, భవిష్యత్తు కోసం ప్రింటౌట్ తీసుకోండి.

ముఖ్యమైన లింకులు:
• AIIMS NORCET 8వ నియామక 2025 అధికారిక నోటిఫికేషన్: Click Here
• AIIMS NORCET 8వ నియామక 2025 ఆన్‌లైన్ దరఖాస్తు: Click Here
• AIIMS అధికారిక వెబ్‌సైట్:Click Here