Govt Jobs : జూనియర్ అసిస్టెంట్ & లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Govt Jobs : జూనియర్ అసిస్టెంట్ & లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Non Teaching Recruitment 2025 – భారతదేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ విద్యా సంస్థలలో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT M) నుండి మరొకసారి విద్యను పూర్తి చేసుకున్న యువతకు మంచి అవకాశాన్ని కల్పిస్తూ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది.

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) మద్రాస్లో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇదొక మంచి అవకాశం గా చెప్పుకోవచ్చు. మే 19వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
» మొత్తం పోస్టుల సంఖ్య :
ఈ నోటిఫికేషన్ ద్వారా ఐఐటి మద్రాస్ వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 23 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ చేయడం ప్రారంభించింది.
» పోస్టుల వివరాలు :
🔹లైబ్రేరియన్-01
( పుస్తకాల నిర్వహణ, డిజిటల్ లైబ్రరీ అభివృద్ధి బాధ్యతలను చేపట్టాలి )
🔹చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్-01
( క్యాంపస్ భద్రతా నిర్వహణ, సిబ్బందిని పర్యవేక్షించడం లాంటి బాధ్యతలను తీసుకోవాలి )
🔹డిప్యూటీ రిజిస్ట్రార్-02
( అడ్మినిస్ట్రేషన్, అకాడమిక్ వ్యవహారాల సమన్వయం లాంటి బాధ్యతలు ఉంటాయి )
🔹టెక్నికల్ ఆఫీసర్-01
( ప్రయోగశాలలు మరియు టెక్నికల్ సపోర్ట్ వంటి పనులు చేయాలి )
🔹అసిస్టెంట్ రిజిస్ట్రా ర్-02
( అకాడమిక్, పర్సనల్, ఎగ్జామినేషన్ విభాగాల్లో సహాయం చేయాలి )
🔹జూనియర్ టెక్నికల్ సూపరిండెంట్-01
( టెక్నికల్ విభాగాల్లో మద్దతు సేవలు చేయాలి )
🔹జూనియర్ సూపరిండెంట్-05
( అడ్మినిస్ట్రేటివ్ పనులు, కార్యాలయ నిర్వహణ పనులు చేపట్టాలి )
🔹జూనియర్ అసిస్టెంట్-10
( డేటా ఎంట్రీ, ఆఫీస్ సహాయక పనులు చేయాలి )
» అర్హత :
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఈ క్రింది అర్హతలు ఉండాలి:
🔹 లైబ్రరీ అండ్ పోస్టుకు లైబ్రరీ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి.
🔹 చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు సెక్యూరిటీ ఫీల్డ్ లో అనుభవంతో పాటు రిటైర్డ్ ఆర్మీ మరియు పోలీస్ అధికారులకు ప్రాధాన్యం ఇస్తారు.
🔹 డిప్యూటీ మరియు అసిస్టెంట్ రిజిస్టార్ పోస్టులకు మేనేజ్మెంట్ మరియు అడ్మినిస్ట్రేషన్ సంబంధిత మాస్టర్స్ డిగ్రీ తో పాటు అనుభవం ఉండాలి.
🔹 జూనియర్ సూపరిండెంట్ మరియు అసిస్టెంట్ లాంటి పోస్టులకు కనీసం బ్యాచులర్స్ డిగ్రీ తో పాటు కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.
» వయసు :
🔹చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రారు పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 45 ఏళ్లు వయస్సు లోపు ఉండాలి.
🔹JTS, JS పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయసు 32 ఏళ్లు లోపు వయస్సు ఉండాలి.
🔹జూనియర్ అసిస్టెంట్కు 27 ఏళ్లు వయసు పరిమితి ఇవ్వడం జరిగింది.
» ఎంపిక విధానం :
ఎంపిక విధానం ఈ క్రింది ప్రక్రియల ద్వారా నిర్వహిస్తారు:
🔹రాతపరీక్ష
🔹ప్రొఫెషనల్ కాంపిటెన్స్ టెస్ట్
🔹స్కిల్ టెస్ట్
🔹ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
» దరఖాస్తు విధానం :
అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునేటప్పుడు అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవం, గుర్తింపు పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
» దరఖాస్తులకు చివరితేది :
19.05.2025.
» ముఖ్యమైన సూచనలు :
🔹అభ్యర్థులు ఒక్కసారి దరఖాస్తు సమర్పించిన తర్వాత మార్పులు చేయలేరు కనుక జాగ్రత్తగా అప్లికేషన్ను చూసి మరి పూర్తి చేయాలి.
🔹 రిజర్వేషన్ కోట గల అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా అందించాలి.
🔹 స్కాన్ చేసిన డాక్యుమెంట్లు అన్ని స్పష్టంగా ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా ఆర్ మార్ట్ లో ఫార్మాట్ లో ఉండాలి.
🔹 ఐఐటి మద్రాస్ వెబ్సైట్ను తరచూ సందర్శిస్తూ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి.
» వెబ్సైట్ : https://recruit.iitm.ac.in
🔷Official Notification PDF Click Here
🔷Online Apply Link Click Here
🔷Telegram Link Click Here
