Telangana Jobs

12th అర్హతతో రాత పరీక్ష లేకుండా మరో జిల్లాలో Anganwadi జాబ్.. కావలసిన డాక్యుమెంట్ వివరాలు

12th అర్హతతో రాత పరీక్ష లేకుండా మరో జిల్లాలో Anganwadi జాబ్.. కావలసిన డాక్యుమెంట్ వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Anganwadi AWT & AnganwadiAWH Recruitment 2026 Apply Now: తెలంగాణలో పెద్దపల్లి జిల్లా మహమ్మద్ నగర్, నల్గొండ జిల్లాలలో నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసినదే. ఈరోజు మరో కొత్త జోగులాంబ గద్వాల్ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల ఐ.సి.డి.యస్ గద్వాల్, మల్దకల్ మరియు మనోపాడ్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న 64 అంగన్వాడి టీచర్లు మరియు గిరిజన ప్రాంతంలో 09 అంగన్వాడి సహాయకురాలు పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళ అభ్యర్దినుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు కోరనైనది. తేది: 29/06/2026 నుండి 08/07/2026 వరకు సాయంత్రము 5.00 గంటలలోపు క్రింద తెలిపిన వెబ్ సైటు లో దరఖస్తు చేసుకోగలరు

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు:

విద్య అర్హత: సదరు అభ్యర్ధునీలు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండవలయును. ఆయా (హెల్పర్) పోస్ట్ కు ఇంటర్ అభ్యర్థినులు లేని యెడల 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక పరిగణలోకి తీసుకోబడును. వయస్సు 01/07/2026 నాటికి 18 సంవత్సరములు నుండి 35 సంవత్సరములలోపు ఉండాలి. దరఖాస్తు చేసుకోబోయే మహిళలు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి. గ్రామీణ ప్రాంతానికి సదరు గ్రామ పంచాయతీకి చెందిన వారు అయి ఉండాలి. పట్టణ ప్రాంతానికి సంబందిత వార్డ్కు చెందిన వారు అయి ఉండాలి.

🛑ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసిన ధ్రువీకరణ పత్రాలు (Scanned copies)

1.పుట్టిన తేది / వయస్సు ధృవీకరణపత్రము ( SSC certificate ).

2. కుల ధృవీకరణపత్రము తహసిల్దార్ చే

3. విద్యార్హత ధృవీకరణపత్రము. ఇంటర్ / ఆ పై విద్య అర్హతలు మార్కుల జాబితా.

4. నివాస ధృవీకరణపత్రము. తహసిల్దార్ చే

5. అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణపత్రము.

7. ఆనాధ అయితే ఆనాధ సర్టిఫికేట్.

ప్రాజెక్టుల వారీగా ఖాళీల పూర్తి వివరాలు జతపరచడం అయినది. ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు పరచటానికి గానీ, మార్పులు చేయడానికిగానీ జిల్లా కలెక్టర్ గారికి పూర్తి అధికారం కలదు. (జిల్లా కలెక్టర్, జోగుళాంబ గద్వాల్ గారి అనుమతితో ఈ ప్రకటన జారీ ఛేయనైనది).

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులు వారు దరఖాస్తు చేసుకున్న అంగన్ వాడి కేంద్రము యొక్క సంబందిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయములో తేది: 08-07-2026 నుండి 17-07-2026 వరకు అన్ని కార్యాలయ పని వేళలలో ఒరిజినల్ ద్రువపత్రాలను, attested Xerox కాపీలతో పరిశీలనకు సమర్పించవలెను. లేని యెడల వారి దరఖాస్తులను పరిగణనలోనికి తీసుకొనబడవు.

🛑New Notification Pdf Click Here

🛑 Vacancy And Roster Details Click Here

🛑 Education Qualification & Guidelines Click Here

🛑Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *