Anganwadi Jobs : మహిళలకు గుడ్ న్యూస్.. 2 జిల్లాలలో 272 టీచర్లు, సహాయక ఉద్యోగులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.. నియామక ప్రక్రియ ప్రారంభం
Anganwadi Jobs : మహిళలకు గుడ్ న్యూస్.. 2 జిల్లాలలో 272 టీచర్లు, సహాయక ఉద్యోగులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.. నియామక ప్రక్రియ ప్రారంభం
Telangana ICDS Anganwadi Teacher & Anganwadi Helper Recruitment 2026 Apply Now : తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో ఈ రోజులు కొత్త జిల్లా లో 272 అంగన్వాడి టీచర్ మరియు ఆయాల పోస్టుల భర్తీకి కొత్త జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 3 సెప్టెంబర్ 2026.

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జైశంకర్-భూపాలపల్లి & మహబూబాబాద్ ఐ.సి.డి.యస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 126 అంగన్వాడి టీచర్ (అన్నీ ప్రాంతాలలో) మరియు 141 అంగన్వాడీ ఆయాలు (గిరిజన ప్రాంతాలలో మాత్రమే) భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో వయసు కలిగి ఉండాలి. స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. జైశంకర్-భూపాలపల్లి & మహబూబాబాద్ జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల ఐ.సి.డి.యస్ మరిపెడ, ప్రాజెక్టు లో ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్ల పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళ అభ్యర్థినుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు కోరనైనది. తేది: 25.08.2026 నుండి 03.09.2026 వరకు సాయంత్రము 5.00 గంటలలోపు క్రింద తెలిపిన వెబ్ సైటు లో దరఖస్తు చేసుకోగలరు. ఖాళీలు, విద్యార్హత మరియు రిజర్వేషన్లకు సంభదించిన పూర్తి వివరములు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ నందు పొందగలరు.
ఖాళీల వివరాలు:
ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ 126 అంగన్వాడి టీచర్ మరియు 141 అంగన్వాడీ ఆయాలు భర్తీ చేస్తున్నారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు:
విద్య: సదరు అభ్యర్థునిలు తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండవలయును.
వయస్సు: 01/07/2026 నాటికి 18 సంవత్సరములు నుండి 35 సంవత్సరములలోపు ఉండాలి.
స్థానికత :
1. దరఖాస్తు చేసుకోబోయే మహిళలు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి.
2. గ్రామీణ ప్రాంతానికి సదరు గ్రామ పంచాయతీకి చెందిన వారు అయి ఉండాలి.
3. పట్టణ ప్రాంతానికి సంబందిత వార్డు చెందిన వారు అయి ఉండాలి.
4. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్టీలకు కేటాయించిన అంగన్ వాడీ టీచర్ పోస్టుకు అదే హామ్లెట్/ఆవాసం (Habitation) లేదా వార్డ్ కు చెందిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
5. ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాస్ కింద ఎస్సీలకు కేటాయించిన అంగన్ వాడీ టీచర్ పోస్టుకు అదే గ్రామపంచాయతీకి లేదా వార్డ్ కు చెందిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
6. సంబందిత తహసిల్దార్ గారిచే ధృవీకరించిన నివాస ధృవీకరణ పత్రము తప్పనిసరిగా జతచేయవలయును. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరము లోపు తీసుకున్న నివాస ధ్రువీకరణ పత్రములను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి : ఆన్లైన్ విధానంలో http://wdcw.tg.nic.in
దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు : ఆన్ లైన్ దరఖాస్తులు కోరనైనది. తేది: 25.08.2026 నుండి 03.09.2026 వరకు సాయంత్రము 5.00 గంటలలోపు క్రింద తెలిపిన వెబ్ సైటు లో దరఖస్తు చేసుకోగలరు. ఖాళీలు, విద్యార్హత మరియు రిజర్వేషన్లకు సంభదించిన పూర్తి వివరములు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ నందు పొందగలరు.
ఆన్లైన్లో అప్లోడ్ చేయావలసిన ధ్రువపత్రాలు (Scanned coples)
1. పుట్టిన తేది / వయస్సు ధృవీకరణపత్రము (SSC certificate).
2. తహసిల్దార్ నుండి జారి చేయబడిన కుల ధృవీకరణపత్రము
3. విద్యార్హత ధృవీకరణపత్రము. ఇంటర్/ ఆ పై విద్య అర్హతలు మార్కుల జాబితా.
4. నివాస ధృవీకరణపత్రము. తహసిల్దార్ చే.
5. అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్ (వర్తిస్తే),
6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణపత్రము (వర్తిస్తే),
7. ఆనాధ అయితే ఆనాధ సర్టిఫికేట్ (వర్తిస్తే),
8. స్పోర్ట్స్ సర్టిఫికేట్ (వర్తిస్తే),
9. Ex. Service man సర్టిఫికెట్ (వర్తిస్తే).
10. EWS సర్టిఫికేట్ (వర్తిస్తే).

🛑Notification Pdf Click Here
🛑 Vacancy Roster List Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Click Here
