Telangana Jobs

TG Anganwadi Jobs 2026: 12వ తరగతి అర్హతతో 320 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు | ICDS Anganwadi Recruitment 2026 Apply Now

TG Anganwadi Jobs 2026: 12వ తరగతి అర్హతతో 320 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు | ICDS Anganwadi Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telangana ICDS Anganwadi Teacher & Helper Recruitment 2026 Apply Now : తెలంగాణ అంగన్వాడీ కేంద్రాల్లో 320 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 12వ తరగతి అర్హతతో అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు అవకాశం.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం ఇవే!

తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో మరో కొత్త 2 జిల్లా లో 320 అంగన్వాడి టీచర్ మరియు ఆయాల పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నారాయణపేట & నాగర్కర్నూల్ జిల్లాలోని ఐ.సి.డి.ఎస్. (ICDS) ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్ల పోస్టులు (హెల్పర్ పోస్టులు గిరిజన ప్రాంతం మాత్రమే) భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్ధుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరడమైనది. దరఖాస్తు ప్రారంభ తేది: 15.09.2026, దరఖాస్తు ముగింపు తేది: 30.09.2026 (సాయంత్రం 05:00 గంటల వరకు) లోపు ఆన్లైన్ దరఖాస్తు & పూర్తి వివరాల కోసం వెబ్ సైట్: http://wdcw.tg.nic.in నందు చూడగలరు.

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, నారాయణపేట & నాగర్కర్నూల్ జిల్లా ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 179 అంగన్వాడి టీచర్ మరియు 141 అంగన్వాడీ ఆయాలు భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 12వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 35 మధ్యలో వయసు కలిగి ఉండాలి. స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు లో ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్ల & ఆయా పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళ అభ్యర్థినుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరనైనది. దరఖాస్తు ప్రారంభ తేది: 15.09.2026, దరఖాస్తు ముగింపు తేది: 30.09.2026 (సాయంత్రం 05:00 గంటల వరకు లోపు క్రింద తెలిపిన వెబ్ సైటు లో దరఖస్తు చేసుకోగలరు. ఖాళీలు, విద్యార్హత మరియు రిజర్వేషన్లకు సంభదించిన పూర్తి వివరములు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ నందు పొందగలరు.

ఖాళీల వివరాలు:

ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ 179 అంగన్వాడి టీచర్ మరియు 141 అంగన్వాడీ ఆయాలు  భర్తీ చేస్తున్నారు. కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా (అచం పేట్, బల్మూర్, కల్వకుర్తి, కొల్లాపూర్ & నాగర్ కర్నూల్) ప్రాజెక్టులలో ఖాళీలు అయితే ఉన్నాయి. నారాయణపేట జిల్లాలోని 3 ఐ.సి.డి.ఎస్ (మద్దూర్, మక్తల్ & నారాయణ పేట) ప్రాజెక్టుల పరిధిలోని ఖాళీలు అయితే ఉన్నాయి.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు:

అంగన్వాడీ టీచర్ మరియు సహాయకురాలు పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

•01/07/2026 నాటికి 18 సంవత్సరములు నుండి 35 సంవత్సరములలోపు ఉండాలి.

మహిళలు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలి : ఆన్లైన్ విధానంలో http://wdcw.tg.nic.in

ఆన్లైన్ అప్లోడ్ చేయావలసిన ధ్రువపత్రాలు (Scanned coples)

1. పుట్టిన తేది / వయస్సు ధృవీకరణపత్రము (SSC certificate).

2.కుల ధృవీకరణపత్రము – తహసిల్దార్ నుండి జారి ఉడాలి.

3. విద్యార్హత ఇంటర్మీడియట్ – ధృవీకరణపత్రము

4. నివాస ధృవీకరణపత్రము- తహసిల్దార్ చే.

5. అంగవైకల్యం కలిగిన వారు – సదరం సర్టిఫికెట్ (వర్తిస్తే),

6. వితంతువు అయితే – భర్త మరణ ధృవీకరణపత్రము (వర్తిస్తే),

7. ఆనాధ అయితే – ఆనాధ సర్టిఫికేట్ (వర్తిస్తే),

అభ్యర్థుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది:

•మొత్తం మార్కులు 100

•ఇంటర్మీడియట్/ 12వ తరగతి మార్కుల మెరిట్: 70 మార్కులు.

•ప్రత్యేక కేటగిరీలు: వితంతువులు: 5 మార్కులు, అనాథలు: 10 మార్కులు, దివ్యాంగులు: 5 మార్కులు.

•జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ-10 మార్కులు

దరఖాస్తు ముఖ్యమైన తేదీ వివరాలు : దరఖాస్తు ప్రారంభ తేది: 15.09.2026, దరఖాస్తు ముగింపు తేది: 30.09.2026 (సాయంత్రం 05:00 గంటల వరకు) ఆన్లైన్ దరఖాస్తు & పూర్తి వివరాల కోసం వెబ్ సైట్: http://wdcw.tg.nic.in నందు చూడగలరు.

🛑1st Notification Pdf Click Here

🛑2ndNotification Pdf Click Here

🛑 Vacancy Roster List Click Here

🛑Official Website Click Here

🛑Apply Online Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *