5th, 7th & ఇంటర్ అర్హతతో జిల్లా కలెక్టర్ ఆఫీసులో గ్రూప్ IV ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Collector Office Group-IV Recruitment 2026
5th, 7th & ఇంటర్ అర్హతతో జిల్లా కలెక్టర్ ఆఫీసులో గ్రూప్ IV ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana Collector Office Group-IV Recruitment 2026
Telangana Collector Office Group-IV Notification 2026 Latest Junior Assistant, Librarian Grade-III & Office Subordinate Job Recruitment 2026 Apply Now: తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్ కార్యాలయము, కరీంనగర్ జిల్లా దివ్యాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాల నియామక కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల బ్యాక్ లాగ్ గ్రూప్-IV మరియు గ్రూప్-IV కానీ జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్-III, ఆఫీస్ సబార్డినట్, శానిటరీ జవాన్, కుక్, కమాటి, పబ్లిక్ హెల్త్ వర్కర్, నాన్ పబ్లిక్ హెల్త్ & వర్కర్ – 20 ఉద్యోగాల పరిమిత నియామకాలకు అనుబంధంగా ఇవ్వబడిన నిర్ణీత ప్రొఫార్మాలో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజులలోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడవు. అభ్యర్ధులు తమ అర్హతలను బట్టి దరఖాస్తు చేసుకునే ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తు సమర్పించాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఒకే దరఖాస్తు సమర్పించిన పక్షంలో, అందులో మొదట పేర్కొన్న పోస్టుకు మాత్రమే ఆ దరఖాస్తును పరిశీలించడం జరుగుతుంది.

పోస్ట్ వివరాలు :
• జూనియర్ అసిస్టెంట్
• లైబ్రేరియన్-III
• ఆఫీస్ సబార్డినట్
• శానిటరీ జవాన్
• కుక్
• కమాటి
• పబ్లిక్ హెల్త్ వర్కర్
• నాన్ పబ్లిక్ హెల్త్ & వర్కర్ తదితర మొత్తం 20 ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హత :
• గుర్తింపు పొందిన సంస్థ నుండి 5వ తరగతి, 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
• ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. లైబ్రేరియన్ సైన్సులో సర్టిఫికేట్ కోర్స్ ఉత్తీర్ణత. (CLISC)
• భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన యూనివర్సిటీ యందు నిర్వహించబడే ఏదేని కోర్సు యందు డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి.

వయసు : దరఖాస్తుదారులకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి మరియు గరిష్టంగా 44 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక: సంబంధిత ఉద్యోగమునకు ఉద్దేశింపబడిన విద్యార్హతలో పొందిన మార్కులు- 80 మార్కులు
• అంగవైకల్య శాతం – 10 మార్కులు
• వయస్సు – 10 మార్కులు
• మొత్తం 100 మార్కులు.
వేతనం: ఈ నోటిఫికేషన్ లో నెలకు ₹18,000/- to ₹36,000/- మధ్యలో జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.12.2026 వరకు సాయంత్రం 5:00 గంటల వరకు.
చిరునామా: దరఖాస్తులను జిల్లా సంక్షేమ అధికారి, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల శాఖ, రూమ్ నెం.7, నూతన కలెక్టర్ కార్యాలయము, కరీంనగర్ నందు దాఖలు చేయవలెను.
అధికార వెబ్ సైట్ : https://karimnagar.telangana.gov.in/
ధృవపత్రాలు మరియు ఫోటోగ్రాప్ల సమర్పణ : అభ్యర్థులు తమ విద్యార్హత ధృవపత్రాలు, జనన తేదీ నిర్ధారణకు సంబంధించిన ధృవపత్రం (SSC సర్టిఫికేట్ లేదా ఇతర సంబంధిత ధృవపత్రం), సదరం సర్టిఫికేట్ మరియు ఎంప్లాయ్ మెంట్ కార్డు జిరాక్స్ ప్రతులను గెజిటెడ్ అధికారి ద్వారా అటెస్టేషన్ చేయించి దరఖాస్తుతో జతపరచాలి. అటెస్టేషన్ చేయని ధృవపత్రాల ప్రతులు స్వీకరించబడవు. అలాగే, ఇటీవల తీసుకున్న రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ ను జతపరచాలి. ఫోటోగ్రాప్ల ముందు భాగంలో అభ్యర్థి తన సంతకాన్ని ఇంకు పెన్ తో చేయాలి. వాటిలో ఒక ఫోటోను దరఖాస్తుకు అతికించి, మరొక ఫోటోను దరఖాస్తుకు పిన్ చేయాలి. దరఖాస్తులో అభ్యర్థి సెల్ఫోన్ నంబరును తప్పనిసరిగా పేర్కొనాలి.
వైకల్య కేటగిరీ వారీగా అర్హత : ప్రతి పోస్టుకు కేటాయించిన నిర్దిష్ట వైకల్య కేటగిరీకి చెందిన అభ్యర్ధులు మాత్రమే సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేయరాదు. నిర్దేశిత కేటగిరికి చెందని అభ్యర్ధుల దరఖాస్తులు మరియు సంబంధిత వైకల్య ధృవీకరణ పత్రం జతపరచని దరఖాస్తులు తిరస్కరించబడతాయి.
దరఖాస్తుల సమర్పణ విధానం : అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తులను సీల్డ్ కవరులో ఉంచి, కవరు పైభాగంలో దరఖాస్తు చేసుకునే పోస్టు పేరును స్పష్టంగా పేర్కొని, జిల్లా కలెక్టర్, కరీంనగర్ గారి పేరున రిజిస్టర్డ్ పోస్టు ద్వారా లేదా నేరుగా జిల్లా సంక్షేమ అధికారి, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయో వృద్ధుల శాఖ, రూమ్ నెం.7, నూతన కలెక్టర్ కార్యాలయము, కరీంనగర్ నందు దాఖలు చేయవలెను.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
