10th అర్హతతో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగ భర్తీ || Latest STPI Recruitment 2026 Apply Now
10th అర్హతతో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగ భర్తీ || Latest STPI Recruitment 2026 Apply Now
Latest STPI Recruitment 2026 Latest Office Attendant & Assistant Job Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ & ఐటి మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్తి గల సొసైటీ అయిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. గ్రూప్ ‘బి’ & అంతకంటే తక్కువ స్థాయి ఎస్&టి, మరియు నాన్-ఎస్&టి పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన ఇతర వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 12 అక్టోబర్ 2026 లోపల www.stpi.in. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ‘బి’ & అంతకంటే తక్కువ స్థాయి ఎస్&టి, మరియు నాన్-ఎస్&టి.. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. మెట్రిక్యులేషన్ (SSC) లేదా దానికి సమానమైన అర్హతలో ఉత్తీర్ణత, బాచిలర్స్ డిగ్రీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 56 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ www.stpi.in. లో ఆన్లైన్ లో 12 అక్టోబర్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (A-V)
🔹మెంబెర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ (MTSS) ES-V
🔹మెంబెర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ (MTSS) ES-IV
🔹అసిస్టెంట్ (A-II)
🔹ఆఫీస్ అటెండెంట్ (S-I)
మొత్తం 10 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో పట్టభద్రులై, సిబ్బంది/పరిపాలన/నిఘా రంగంలో ఆరు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొంది, సిబ్బంది/పరిపాలన/నిఘా రంగంలో నాలుగు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
🔹 మెంబెర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ (MTSS) ES-V పోస్టులకు : ఎలక్ట్రానిక్స్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ టెలికమ్యూనికేషన్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్/ఐటీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా DOEACC ‘A’ లెవెల్ సర్టిఫికేట్ కలిగి ఉండటం.
🔹 మెంబెర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ (MTSS) ES-IV పోస్టులకు : ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/టెలికమ్యూనికేషన్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్/ఐటీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా DOEACC ‘A’ లెవెల్ సర్టిఫికేట్ కలిగి ఉండటం.
🔹 అసిస్టెంట్ (A-II) పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
🔹 ఆఫీస్ అటెండెంట్ (S-I) పోస్టులకు : మెట్రిక్యులేట్ లేదా తత్సమానం లలో ఉత్తీర్ణులై ఉండాలి.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹పోస్టులను అనుసరించి 56 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు : నెల జీతం పే లెవల్ 7 : రూ.44,900/- to రూ.1,42,400/- వరకు చెల్లిస్తారు.
🔹 మెంబెర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ (MTSS) ES-V పోస్టులకు : నెల జీతం పే లెవెల్ 6 : రూ. 35,400/- to రూ.1,12,400/- వరకు చెల్లిస్తారు.
🔹 మెంబెర్ టెక్నికల్ సపోర్ట్ స్టాఫ్ (MTSS) ES-IV పోస్టులకు : నెల జీతం పే లెవెల్ 5: రూ.29,200/- to రూ.92,300/- వరకు చెల్లిస్తారు.
🔹 అసిస్టెంట్ (A-II) పోస్టులకు : నెల జీతం పే లెవల్ 4 : రూ.25,500/- to రూ.81,100/- వరకు చెల్లిస్తారు.
🔹 ఆఫీస్ అటెండెంట్ (S-I) పోస్టులకు : నెల జీతం పే లెవల్ 1: రూ.18,000/- to రూ.56,900/- వరకు చెల్లిస్తారు.
🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
అభ్యర్థి ప్రతి దరఖాస్తుకు రూ. 500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) దరఖాస్తు రుసుము చెల్లించాలి. చెల్లింపు విధానం మరియు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్‌లో పేర్కొనబడతాయి. మహిళా అభ్యర్థులు మరియు ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ వర్గానికి చెందిన అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఒకసారి చెల్లించిన రుసుము వాపసు ఇవ్వబడదు.
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 12 అక్టోబర్ 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్‌కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఎంపిక విధానం:
షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మాత్రమే రాత పరీక్షకు పిలుస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థికి మెరిట్ ప్రకారం నియామకం ఇవ్వబడుతుంది.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 12 అక్టోబర్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).
👉 అధికారిక వెబ్సైట్: www.stpi.in.
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
https://t.me/gk15telugu
🔷Official Website Click Here

