10th అర్హతతో MTS, అనిమల్ అటెండంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ || Latest PGIMER Recruitment 2026 Apply Now
10th అర్హతతో MTS, అనిమల్ అటెండంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ || Latest PGIMER Recruitment 2026 Apply Now
Latest PGIMER Recruitment 2026 Latest MTS & Library Attendant Job Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (PGIMER) నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. వివిధ 57 గ్రూప్ ‘C’ పోస్టులకు మరియు 03 గ్రూప్ ‘A’, ‘B’ & ‘C’ పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన ఇతర వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 19 అక్టోబర్ 2026 లోపల www.pgimer.edu.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (PGIMER) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ 57 గ్రూప్ ‘C’ పోస్టులకు మరియు 03 గ్రూప్ ‘A’, ‘B’ & ‘C’.. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. మెట్రిక్యులేషన్ (SSC) లేదా దానికి సమానమైన అర్హతలో ఉత్తీర్ణత, 10+2, డిప్లొమా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 35 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ www.pgimer.edu.in లో ఆన్లైన్ లో 19 అక్టోబర్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (PGIMER) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్-I
🔹అనిమల్ అటెండెంట్
🔹బార్బర్
🔹మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (శానిటేషన్) గ్రేడ్-III
🔹మెడికల్ ఆఫీసర్
🔹కంప్యూటర్ ప్రోగ్రాముర్
🔹ఫార్మసిస్ట్ గ్రేడ్-II
మొత్తం 60 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹 లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్-I పోస్టులకు : సైన్స్‌తో మెట్రిక్. లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా. పేరున్న లైబ్రరీలో పుస్తకాలు & జర్నల్స్‌ను నిర్వహించడంలో ఒక సంవత్సరం అనుభవం.
🔹 అనిమల్ అటెండెంట్ పోస్టులకు : మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన విద్యార్హత. ఏదైనా భాషలో చదవడం, వ్రాయడం తెలిసి ఉండాలి, అనగా హిందీ/ఇంగ్లీష్/పంజాబీ. శుభ్రపరచడం మరియు దుమ్ము దులపడం గురించి పరిజ్ఞానం.
🔹 బార్బర్ పోస్టులకు : మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు ఆ రంగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం.
🔹 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు : మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన విద్యార్హత. ఊడ్చడం, దుమ్ము దులపడం మరియు శుభ్రపరచడంపై పరిజ్ఞానం.
🔹మెడికల్ ఆఫీసర్ పోస్టులకు : భారత వైద్య మండలి చట్టం, 1956లోని I లేదా II షెడ్యూల్ లేదా మూడవ షెడ్యూల్లోని పార్ట్ IIలో చేర్చబడిన వైద్య అర్హత (మూడవ షెడ్యూల్లోని పార్ట్ IIలో చేర్చబడిన అర్హతలు కలిగిన వ్యక్తులు చట్టంలోని సెక్షన్ 13(3)లో పేర్కొన్న షరతును కూడా నెరవేర్చాలి.) అభ్యర్థి రాష్ట్ర వైద్య మండలిలో నమోదు చేయబడి ఉండాలి. కుటుంబ నియంత్రణ & విద్యా పద్ధతులలో ప్రత్యేక శిక్షణ పొంది ఉండాలి. సంబంధిత ప్రత్యేకతలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
🔹కంప్యూటర్ ప్రోగ్రాముర్ పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గణాంకాలు/గణితం (గణాంకాలతో)/ఆపరేషన్ రీసెర్చ్/ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ లేదా దానికి సమానమైనది. ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌పై వాస్తవ ప్రోగ్రామింగ్‌లో లేదా ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఆపరేషన్‌లో ఒక సంవత్సరం అనుభవం. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గణితం (గణాంకాలతో)/ఫిజిక్స్/గణాంకాలలో బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైనది. ఎలక్ట్రానిక్ కంప్యూటర్ ఆపరేషన్‌లో ఏడు సంవత్సరాల అనుభవం, ఇందులో ఎలక్ట్రానిక్ కంప్యూటర్ వాస్తవ ప్రోగ్రామింగ్ అనుభవం కూడా చేరి ఉంటుంది.
🔹ఫార్మసిస్ట్ గ్రేడ్-II పోస్టులకు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/బోర్డు నుండి మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన విద్యార్హత. గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుండి ఫార్మసీలో డిప్లొమా. ఫార్మసీ చట్టం, 1948 ప్రకారం రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయి ఉండాలి.
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹పోస్టులను అనుసరించి 35 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹అనిమల్ అటెండెంట్, బార్బర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (శానిటేషన్) గ్రేడ్-III పోస్టులకు నెల జీతం రూ.18,000/- to రూ.56,900/- వరకు చెల్లిస్తారు.
🔹లైబ్రరీ అటెండంట్ పోస్టులకు నెల జీతం రూ.21,700/- to రూ.69,100/- వరకు చెల్లిస్తారు.
🔹ఫార్మసిస్ట్ గ్రేడ్-II పోస్టులకు నెల జీతం రూ.29,200/- to రూ.92,300/- వరకు చెల్లిస్తారు.
🔹కంప్యూటర్ ప్రోగ్రామర్ పోస్టులకు నెల జీతం రూ.44,900/- to రూ.1,42,400/- వరకు చెల్లిస్తారు.
🔹మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నెల జీతం రూ.56,100/- to రూ.1,77,500/- వరకు చెల్లిస్తారు.
🔷 దరఖాస్తు ఫీజు : అభ్యర్థులు అందరికి దరఖాస్తు ఫీజు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
* ప్రామాణిక వైకల్యాలు గల వ్యక్తులు (PwBD): రుసుము చెల్లింపు నుండి మినహాయింపు.
* ఎస్సీ/ఎస్టీ వర్గం: రూ.800/- మరియు వర్తించే లావాదేవీ ఛార్జీలు.
* జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌తో సహా మిగిలిన వారందరికీ: రూ.1500/- మరియు వర్తించే లావాదేవీ ఛార్జీలు.
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ : 19 అక్టోబర్ 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్‌కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు, ఎంపిక విధానం:
షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మాత్రమే రాత పరిక్ష, స్కిల్ టెస్ట్, డాకుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 19 అక్టోబర్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).
👉 అధికారిక వెబ్సైట్: www.pgimer.edu.in
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

à
