Railway Jobs : రైల్వే స్టేషన్ లో భారీగా స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. చివరి తేదీ ఇదే | RRB NTPC Station Master Recruitment 2026
Railway Jobs : రైల్వే స్టేషన్ లో భారీగా స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. చివరి తేదీ ఇదే | RRB NTPC Station Master Recruitment 2026
RRB NTPC Station Master Recruitment 2026 Latest Date : రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు RRB స్టేషన్ మాస్టర్ రిక్రూట్మెంట్ 2026 ఈనెల నవంబర్ 25, 2026 వరకు మాత్రమే అవకాశం ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు(RRB) CEN No.08/2026 కింద సుమారు 1,250 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఆన్లైన్ దరఖాస్తులు అక్టోబర్ 27, 2026 నుంచి ప్రారంభమై నవంబర్ 25, 2026 వరకు మాత్రమే అవకాశం ఉంది. కేవలం ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) అధికారిక వెబ్సైట్ rrb.indianrailways.gov.inలో చూడవచ్చు.

ఈ నియామకాలు దేశవ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్ లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB)లో 1250 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం ప్రకారం లెవల్-6 పే స్కేల్ రూ. ₹35,400/- to ₹1,12,400/- వర్తిస్తుంది. స్టేషన్ మాస్టర్ ఉద్యోగానికి అవసరమైన విద్యార్హతలు, వయోపరిమితి, వయోసడలింపులు మరియు ఇతర అర్హతలను పూర్తి నోటిఫికేషన్లో నిర్ధారించుకోవాలి.
సాధారణంగా ఇటువంటి పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ అవసరమవుతుంది. అలాగే వయస్సు 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. అయితే, CEN 08/2026కు సంబంధించి తుది అర్హతలను అధికారిక నోటిఫికేషన్లో చూసిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా [RRB అధికారిక వెబ్సైట్](https://rrb.indianrailways.gov.in) సందర్శించండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
