Andhra Pradesh jobs

Security Guard Jobs Requirement in Telugu

Security Guard Jobs Requirement  in Telugu

10న పాడేరులో జాబ్మేళా పాడేరు/ అరకులోయ : విశాఖ జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యం లో విమానాశ్రయం, ఎంఎన్సీ కంపెనీల్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలకు ఈ నెల 10 న జాబ్మేళా నిర్వహిస్తున్నామని పాడేరు ఏఎస్పీ జగదీష్, పాడేరు, అరకులోయ సీఐలు సుధాకర్, జి.డి.బాబులు సోమవారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ‘ప్రేరణ’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ఈ జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు టెన్త్ ఆపైన విద్యార్హత కలిగి ఉండాలన్నారు.

»18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు, 167 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలన్నారు. అభ్యర్థి తండ్రి/ తల్లి 2018-19 మధ్య కాలంలో ఉపాధి హామీ ద్వారా 100 రోజుల పనిదినాలు పూర్తి చేసి జాబ్కార్డు కలిగి ఉంటే

»నెలకు రూ .7 వేల చొప్పున 3 నెలలకు రూ .21 వేల స్టైఫండ్ కూడా పంపిణీ చేస్తామన్నారు . 3 నెలల శిక్షణ తర్వాత ఎయిర్పోర్టు లేదా ఎంఎన్సీ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం కల్పిస్తామని వారు తెలిపారు. 100 శాతం ఉద్యోగ నియామకాలు జరుగుతాయన్నారు. హిందూపురం లో ఒక నెల స్వల్ప శిక్షణ ఉంటుందని, ఆ వెంటనే ఉద్యోగం కల్పిస్తామన్నారు.

ఈ నెల 10 వ తేదీన ఉదయం 10 గంట లకు తలారిసింగి సీఏహెచ్ పాఠశాలలో ఎంపిక జరుగుతుం దన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!