Free Sewing Machine : ఉచిత కుట్టుమిషన్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి
Free Sewing Machine : ఉచిత కుట్టుమిషన్ కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి
Sewing Machine Application Form : మహిళలకు సువర్ణ అవకాశం.. ఉచితంగా కుట్టు మిషన్ కోసం అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకు వయసు 55 సంవత్సరాలు లోపు ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ఉచిత కుట్టుమిషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. నిరుద్యోగ మహిళలకు శుభవార్త చెప్పుకోవచ్చు. ఆన్లైన్ లో అప్లై చేస్తే ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా కుట్టు మిషన్ పొందే అవకాశం రావడం జరిగింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశం, మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడం మరియు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడం. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు కుట్టుమిషన్లు ఉచితంగా పంపిణీ చేయబడతాయి.
ఈ పథకం కోసం తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ఇందులో ప్రధానంగా ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైనులు, పార్సీ వంటి మైనారిటీ వర్గాలకు చెందిన, కుట్టుపనిలో శిక్షణ పొందిన మహిళలు మాత్రమే అర్హులు. మరిన్ని వివరాల కోసం 9247720650, 9492611057 ఈ రెండు నెంబర్ ని సంప్రదించగలరు.
![](https://gk15telugu.com/wp-content/uploads/2024/12/IMG-20241221-WA0012-1024x572.jpg)
సంస్థ పేరు తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC).
అర్హతలు
లింగం : మహిళలు మాత్రమే
విద్యా అర్హత : కనీసం 5వ తరగతి
వయస్సు : 18 నుంచి 55 సంవత్సరాలు
ఆదాయం : గ్రామాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు
టైలరింగ్ శిక్షణ : కుట్టుపనిలో శిక్షణ పొందినవారు
దరఖాస్తు విధానం
• ముందుగా తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ (https://tgobmms.cgg.gov.in/sewingForm.action)ను సందర్శించాలి.
• అందులో మీ వ్యక్తిగత వివరాలు, చిరునామా, ఇతర వివరాలను పూర్తి చేయాలి.
• అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి.
• ప్రివ్యూ ఆప్షన్ ద్వారా నింపిన వివరాలను పరిశీలించి సబ్మిట్ చేయాలి.
• సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నంబర్ అందుతుంది.
దరఖాస్తు రుసుము
ఈ పథకానికి దరఖాస్తు రుసుము లేదు.
ఎంపిక ప్రక్రియ
అర్హతలను పరిశీలించిన తర్వాత మాత్రమే ఎంపిక చేస్తారు. కుట్టుపనిలో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
ముఖ్యమైన తేదీ వివరాలు
దరఖాస్తు ప్రారంభ తేదీ: డిసెంబర్ 16
దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 31
కావలసిన డాక్యుమెంట్ వివరాలు
• ఆధార్ కార్డ్ (గుర్తింపు పత్రం)
• చిరునామా రుజువు (ఆధార్, ఎలక్ట్రిసిటీ బిల్లు)
• టైలరింగ్ శిక్షణ ధ్రువీకరణ పత్రం
• మైనారిటీ అని నిరూపించే పత్రం
• వయస్సు నిర్ధారణ పత్రం
![](https://gk15telugu.com/wp-content/uploads/2024/12/IMG-20241221-WA0012-1024x572.jpg)
🛑Sewing Machine Application Form Click Here
తరచూ అడిగే ప్రశ్నలు మరియు సమాధానం
ప్రశ్న: ఈ పథకం ద్వారా ఎవరు ప్రయోజనం పొందగలరు?
సమాధానం: ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైనులు, పార్సీ మతాలకు చెందిన, కుట్టుపనిలో శిక్షణ పొందిన 18-55 ఏళ్ల మహిళలు ఈ పథకం కోసం అర్హులు.
ప్రశ్న: దరఖాస్తు ఎలా చేయాలి?
సమాధానం: అధికారిక వెబ్సైట్ (https://tgobmms.cgg.gov.in/sewingForm.action)లో దరఖాస్తు ఫారమ్ నింపి, అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాలి.
ప్రశ్న: పత్రాలు ఎక్కడ అందించాలి?
సమాధానం: ఆన్లైన్లో నింపడం కుదరకపోతే, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని సంప్రదించి, మానవీయంగా ఫారమ్ అందించవచ్చు.