కరెన్సీ నోట్లు ముద్రించే సంస్థ లో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest SPMCIL Recruitment 2026 Apply Now
కరెన్సీ నోట్లు ముద్రించే సంస్థ లో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest SPMCIL Recruitment 2026 Apply Now
Latest SPMCIL Recruitment 2026 Latest Deputy Manager & Assistant Manager Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన (భారత ప్రభుత్వ పూర్తి యాజమాన్యంలో ఉన్న) సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) సంస్థ ద్వారా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. డిప్యూటీ మేనేజర్ మరియు వివిధ రంగాలలో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన ఇతర వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 24 ఆగస్ట్ 2026 లోపల www.spmcil.com. అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి పోస్టులను అనగా డిప్యూటీ మేనేజర్ మరియు వివిధ రంగాలలో ఉన్న అసిస్టెంట్ మేనేజర్.. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. డిగ్రీ, B.E./B.Tech., బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ ఉత్తీర్ణత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 35 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ www.spmcil.com. లో ఆన్లైన్ లో 24 ఆగస్ట్ 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ద్వారా ఈ క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 డిప్యూటీ మేనేజర్ (IT) – అప్లికేషన్ డెవలపర్
🔹 అసిస్టెంట్ మేనేజర్ (HR)
🔹అసిస్టెంట్ మేనేజర్ (F&A)
🔹అసిస్టెంట్ మేనేజర్ (MM)
🔹అసిస్టెంట్ మేనేజర్ (IT)
🔹 అసిస్టెంట్ మేనేజర్ (OL)
🔹 అసిస్టెంట్ మేనేజర్ (safty)
మొత్తం 24 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹డిప్యూటీ మేనేజర్ (IT) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 60% మార్కులు లేదా దానికి సమానమైన CGPAతో ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ B.E./B.Tech.
🔹అసిస్టెంట్ మేనేజర్ (HR) : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నుండి PM & IR/MSW/HR ఎలెక్టివ్‌తో కూడిన MBAలో ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నుండి, MBAకి సమానమైనదిగా పేర్కొనబడే, HR ఎలెక్టివ్‌తో కూడిన మేనేజ్‌మెంట్‌లో ఫస్ట్ క్లాస్ రెండు సంవత్సరాల ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా.
🔹 అసిస్టెంట్ మేనేజర్ (F&A) : బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) డిగ్రీతో పాటు CA/ICWA
🔹 అసిస్టెంట్ మేనేజర్ (MM) : ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిగ్రీ మెకానికల్/ఎలక్ట్రికల్/పల్ప్ & పేపర్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్/ప్రింటింగ్ టెక్నాలజీ విభాగంలో. మరియు రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/MBA కింది రంగాలలో: మెటీరియల్ మేనేజ్‌మెంట్/స్టోర్స్ మేనేజ్‌మెంట్/పర్చేస్/ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్/సప్లై చైన్ మేనేజ్‌మెంట్/లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్.
🔹 అసిస్టెంట్ మేనేజర్ (IT) : ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ MCA/ ఫస్ట్ క్లాస్ B. Tech (కంప్యూటర్ ఇంజనీరింగ్/IT).
🔹 అసిస్టెంట్ మేనేజర్ (OL) : అవసరమైన అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హిందీ లేదా ఆంగ్లంలో ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఆంగ్లం/హిందీ సబ్జెక్టుతో పాటు (అనగా, అభ్యర్థి ఆంగ్లంలో పోస్ట్-గ్రాడ్యుయేట్ అయితే హిందీ, మరియు దీనికి విరుద్ధంగా). మరియు హిందీ నుండి ఆంగ్లంలోకి మరియు దీనికి విరుద్ధంగా అనువాదంలో రెండు సంవత్సరాల అనుభవం
🔹 అసిస్టెంట్ మేనేజర్ (safty) : ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ యొక్క ఏదైనా విభాగంలో గుర్తింపు పొందిన డిగ్రీ మరియు ఫ్యాక్టరీలో పర్యవేక్షక హోదాలో కనీసం 2 సంవత్సరాల ఆచరణాత్మక అనుభవం కలిగి ఉండాలి; లేదా భౌతిక శాస్త్రం లేదా రసాయన శాస్త్రంలో గుర్తింపు పొందిన డిగ్రీ మరియు ఫ్యాక్టరీలో పర్యవేక్షక హోదాలో కనీసం 5 సంవత్సరాల ఆచరణాత్మక అనుభవం కలిగి ఉండాలి;
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹పోస్టులను అనుసరించి 35 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు : నెలకు రూ.50,000/- to రూ.1,60,000/- వరకు చెల్లిస్తారు.
🔹 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు : నెలకు రూ.40,000/- to రూ.1,40,000/- వరకు చెల్లిస్తారు.
🔷 దరఖాస్తు ఫీజు :
జనరల్, EWS మరియు OBC కేటగిరీలకు (మాజీ సైనికులతో సహా) చెందిన అభ్యర్థులకు పరీక్ష రుసుము రూ. 1000/- (తిరిగి చెల్లించబడనిది), SC/ST/PwBD కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు సమాచార రుసుము రూ. 200/- (తిరిగి చెల్లించబడనిది).
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 24 ఆగస్ట్ 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఆన్లైన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు, అలాగే డాకుమెంట్స్ వెరిఫికేషన్(DV), మెడికల్ ఎగ్జామినేషన్(ME), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక పక్రియ నిర్వహిస్తారు.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 24 ఆగస్ట్ 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).
👉 అధికారిక వెబ్సైట్: www.spmcil.com.
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

