రాత పరీక్ష లేకుండా10th అర్హతతో అంగన్వాడి నోటిఫికేషన్ వచ్చేసింది | Anganwadi Teacher & Helper Job Notification District Wise All Detail In Telugu
రాత పరీక్ష లేకుండా10th అర్హతతో అంగన్వాడి నోటిఫికేషన్ వచ్చేసింది | Anganwadi Teacher & Helper Job Notification District Wise All Detail In Telugu
Anganwadi Teacher & Helper Recruitment 2026 Apply Now : కేవలం పదో తరగతి అర్హతతో ఎటువంటి రాత పరీక్ష లేకుండా.. మహిళా అభ్యర్థులకు శుభవార్త…ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో 171 అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అప్లై చేయడానికి చివరి తేదీ 13 ఏప్రిల్ 2026 ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ వైస్సార్ కడప జిల్లాలో వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో 30 అంగన్వాడి టీచర్ (AWW) & 141 అంగన్వాడి సహాయాకురాలు (AWH) పోస్టుల భర్తీ కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

»పోస్టుల వివరాలు:
•అంగన్వాడి కార్యకర్త (AWW) : 30
•అంగన్వాడి సహాయాకురాలు (AWH) : 141
•మొత్తం ఉద్యోగాలు : 171 భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత ::
•పదో తరగతి ఉత్తీర్ణతై ఉండాలి.
•అభ్యర్థులు వివాహితులై స్థానికంగా నివసించేవారు అప్లై చేసుకోవాలి.
•01.07.2026 వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.
»నెల జీతం :
•అంగన్వాడీ కార్యకర్త :: రూ.11,500/-
•అంగన్వాడీ హెల్పర్లు :: రూ.7,000/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 01.07.2026 వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.
»దరఖాస్తు రుసుము: లేదు.
»ఎంపిక విధానం: విద్య అర్హత మెరిట్, వయసు & రోస్టర్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»దరఖాస్తు విధానం : దరఖాస్తు చేయగోరు అభ్యర్ధులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారి వారితో అటేస్టేషన్ చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు 13/04 /2026 సాయంత్రము 5:00 గంటల లోపు సమర్పించి తగు రశీదు పొందవలయును. ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ను https://kadapa.ap.gov.in/ వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకొనగలరు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్దరఖాస్తు ప్రారంభ తేదీ :: 28.03.2026
•ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 13.04.2026
•ఇంటర్వ్యూ నిర్వహణ తేది: 23/04/2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
