10th Pass Jobs | కొత్తగా గ్రూప్ సి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CCRUM Recruitment 2026 Apply Now
10th Pass Jobs | కొత్తగా గ్రూప్ సి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CCRUM Recruitment 2026 Apply Now
Latest CCRUM Recruitment 2026 Latest UDC, LDC & MTC Notification 2026 Apply Online Now : హాయ్ ఫ్రెండ్స్..ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం లభించింది. భారత ప్రభుత్వం సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ (CCRUM) సంస్థ ద్వారా నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఫార్మాసిస్ట్, సోషల్ వర్కర్, రేడియోగ్రాఫర్, కాంపౌండర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టాఫ్ కార్ డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేయడానికి భారత పౌరులు మరియు భారత ప్రభుత్వం గుర్తించిన ఇతర వర్గాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 31 జూలై 2026 లోపల www.ccrum.res.in / www.ccrum.ayush.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఇది ఒక సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ (CCRUM) నుండి విడుదల చేసిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ సి పోస్టులను అనగా ఫార్మాసిస్ట్, సోషల్ వర్కర్ , రేడియోగ్రాఫర్, కాంపౌండర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టాఫ్ కార్ డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్.. పోస్టుల కోసం దరఖాస్తులు చేయనున్నారు. 10th, 10+2, డిప్లమా, డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణత అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వయసు 18 నుండి 28 సంవత్సరాలు మించకుండా కలిగి ఉండాలి. అప్లై చేస్తే పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అధికారిక వెబ్సైట్ www.ccrum.res.in / www.ccrum.ayush.gov.in లో ఆన్లైన్ లో 31 జూలై 2026 లోపు అప్లై చేసుకోవాలి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
🔷పోస్టుల వివరాలు :
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ (CCRUM) ద్వారా ఈ క్రింది గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹 ఫార్మాసిస్ట్
🔹 సోషల్ వర్కర్
🔹 రేడియోగ్రాఫర్
🔹కాంపౌండర్
🔹 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3
🔹 అప్పర్ డివిజన్ క్లర్క్
🔹 లోయర్ డివిజన్ క్లర్క్
🔹 స్టాఫ్ కార్ డ్రైవర్
🔹 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ( మెసెంజర్, వార్డ్ బాయ్, ఫిమేల్ అటెండెంట్, ఆయా, ల్యాబ్ అటెండెంట్, ఫార్మసీ అటెండెంట్ )
మొత్తం 125 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
🔷విద్యార్హత (Educational Qualification):
పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా అర్హతలను నిర్ధారించారు..
🔹ఫార్మాసిస్ట్ : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి సైన్స్‌తో 10+2. రెండు సంవత్సరాలు గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫార్మసీలో డిప్లొమా, రాష్ట్ర/ కేంద్ర ఫార్మసీ కౌన్సిల్‌లో నమోదు..
🔹సోషల్ వర్కర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ, విశ్వవిద్యాలయం/సంస్థ నుండి గుర్తింపు పొందిన సోషల్ వర్క్‌లో డిప్లొమా, గుర్తింపు పొందిన సంస్థ/ఆసుపత్రిలో సాంఘిక సేవలో ఒక సంవత్సరం అనుభవం లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండిసోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ.
🔹 రేడియోగ్రాఫర్ : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి సైన్స్‌తో 10+2. రెండు సంవత్సరాల డిప్లొమా, గుర్తింపు పొందిన సంస్థ నుండి రేడియోగ్రఫీలో సర్టిఫికేట్ గుర్తింపు పొందిన ఆసుపత్రి లేదా వైద్య సంస్థ నుండి రేడియోగ్రఫీలో ఒక సంవత్సరం అనుభవం.
🔹 కాంపౌండర్ : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థనుండి మెట్రిక్ లేదా తత్సమానం. గుర్తింపు పొందిన సంస్థ నుండి కనీసం ఒక సంవత్సరం వ్యవధి గల యునాని వైద్య విధానంలో కాంపౌండర్ సర్టిఫికేట్ శిక్షణ. ప్రాధాన్యంగా యునాని వైద్య విధానపు డిస్పెన్సరీ/ఆసుపత్రిలో 2 సంవత్సరాల అనుభవం.
🔹 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 : గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి మెట్రిక్ లేదా తత్సమానం పరీక్ష ద్వారా నిరూపించబడినట్లుగా, షార్ట్‌హ్యాండ్‌ను నిమిషానికి 80 పదాల వేగంతో మరియు టైప్‌రైటింగ్‌ను నిమిషానికి 40 పదాల వేగంతో వ్రాయగల సామర్థ్యం. కంప్యూటర్ నిర్వహణలో పని అనుభవం.
🔹 అప్పర్ డివిజన్ క్లర్క్ : గుర్తింపు పొందిన విద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
🔹 లోయర్ డివిజన్ క్లర్క్ : 12వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి తత్సమాన అర్హత, కంప్యూటర్‌పై ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం
🔹 స్టాఫ్ కార్ డ్రైవర్ : గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణత. మోటారు కార్లు/LMVలకోసం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం. కనీసం 03 సంవత్సరాల పాటు మోటారు కారు నడిపిన అనుభవం మరియు మోటారు యంత్రాంగంపై పరిజ్ఞానం (అభ్యర్థి వాహనంలోని చిన్నపాటి లోపాలను సరిచేయగలగాలి).
🔹 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : మెట్రిక్యులేషన్ సమానమైన పాస్ లేదా సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ ఉత్తీర్ణత
🔷వయసు పరిమితి (Age limit)
పోస్టులను అనుసరించి అభ్యర్థి గరిష్ట వయసు ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹పోస్టులను అనుసరించి 28 సంవత్సరాలు మించకుండా అభ్యర్థి వయసు ఉండాలి.
🔹ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయసు సడలింపులు కూడా వర్తిస్తాయి.
🔷వేతన శ్రేణి (Salary Details)
పోస్టులను అనుసరించి నెల జీతం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
🔹 ఫార్మాసిస్ట్, సోషల్ వర్కర్, రేడియోగ్రాఫర్ పోస్టులకు : నెలకు పే లెవెల్ 5: రూ.29,200/- to రూ.92,300/- వరకు చెల్లిస్తారు.
🔹 కాంపౌండర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు : నెలకు పే లెవల్ 4: రూ.25,500/- to రూ.81,100/- వరకు చెల్లిస్తారు.
🔹 లోయర్ డివిజన్ క్లర్క్ & స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు : నెలకు పే లెవల్ 2: రూ.19,900/- to రూ.63,200/- వరకు చెల్లిస్తారు.
🔹 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు : నెలకు పే లెవల్ 1: రూ.18,000/- to రూ.56,900/- వరకు చెల్లిస్తారు.
🔷 దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు దారులు దరఖాస్తుతో పాటు గ్రూప్ “సి” పోస్టుకు దరఖాస్తు చేసుకునే అన్ని వర్గాల అభ్యర్థులు రూ.500/- దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ లేని & ఓబీసీ అభ్యర్థులు రూ.800/- పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/దివ్యాంగులు/EWS/మహిళా అభ్యర్థులు/మాజీ సైనికులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
🔹ఫీజు చెల్లింపు చివరి తేదీ: 31 జూలై 2026
🔷దరఖాస్తు ప్రక్రియ (How to Apply)
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ లో కి వెళ్లండి. ఆన్లైన్ దరఖాస్తును పూరించే ముందు, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ లోని మొత్తం సూచనలు మరియు సమాచారాన్ని పూర్తిగా చదవాలని కోరుతున్నారు. అభ్యర్థి ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్ కలిగి ఉండాలి మరియు నియామక ప్రక్రియ అంతటా అది యాక్టివ్గా ఉండేలా చూసుకోవాలి. దరఖాస్తు సీక్వెన్స్ నంబర్, యూజర్ ఐడి, పాస్వర్డ్ మరియు అన్ని ఇతర ముఖ్యమైన కమ్యూనికేషన్లు ఒకే రిజిస్టర్డ్ ఇ-మెయిల్ ఐడి & మొబైల్ నంబర్కు పంపబడతాయి. దరఖాస్తును ఒకసారి సమర్పించిన తర్వాత దాన్ని సవరించలేరు / ఉపసంహరించుకోలేరు మరియు చెల్లించిన తర్వాత రుసుము తిరిగి చెల్లించబడదు లేదా సర్దుబాటు చేయబడదు.
🔷 ఎంపిక విధానం (Selection Process) (Selection Process)
ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఇవ్వడం జరిగింది…
🔹దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), అభ్యర్థి తమ పని విధులను దృష్టిలో ఉంచుకొని ప్రతి పోస్ట్ కి సంబంధించిన నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు, అలాగే డాకుమెంట్స్ వెరిఫికేషన్(DV), మెడికల్ ఎగ్జామినేషన్(ME), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక పక్రియ నిర్వహిస్తారు.
🔷దరఖాస్తుకు చివరి తేదీ
🔹 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026
🔹దయచేసి చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేయడం మంచిది. సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలు ఉండే అవకాశాలను తగ్గించుకోవచ్చు. (ఆన్లైన్ దరఖాస్తులకు మాత్రమే).
👉 అధికారిక వెబ్సైట్: www.ccrum.res.in / www.ccrum.ayush.gov.in
🔷Notification PDF Click Here
🔷Apply Link Click Here
🔷Telegram Link Click Here
🔷Official Website Click Here

