Central Government Jobs

10th, ఇంటర్ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో సివిలియన్ ఉద్యోగాలు.. Latest Indian Coast Guard Civilian Recruitment 2026

10th, ఇంటర్ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో సివిలియన్ ఉద్యోగాలు.. Latest Indian Coast Guard Civilian Recruitment 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Indian Coast Guard Civilian Store Keeper, Driver & MTS Recruitment 2026 : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా.. ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో స్టోర్ కీపర్ గ్రేడ్-II, ఇంజన్ డ్రైవర్, లస్కార్, సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్, MTS (ప్యూయాన్), MTS (చౌకీదార్) సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ముంబైలోని కోస్ట్ గార్డ్ రీజియన్ (వెస్ట్) ప్రధాన కార్యాలయం ఆధ్వర్యంలో మొత్తం 6 పోస్టులను డైరెక్ట్ నియామక పద్ధతిలో భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న భారతీయ అభ్యర్థులు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నియామకానికి సంబంధించిన ప్రకటన 19 నుంచి 25 సెప్టెంబర్ 2026 ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైంది. దరఖాస్తులు చేరేందుకు చివరి తేదీ 03 నవంబర్ 2026గా పేర్కొన్నారు.

భర్తీ చేయనున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్‌లో

•స్టోర్ కీపర్ గ్రేడ్-II
•ఇంజన్ డ్రైవర్
•లస్కార్
•సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్
•MTS (ప్యూయాన్)
•MTS (చౌకీదార్) పోస్టులు ఉన్నాయి.

విద్యా అర్హత

10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన ప్రభుత్వ సంస్థ నుంచి ఇంజన్ డ్రైవర్‌గా సామర్థ్య ధ్రువపత్రం అవసరం లేదా డ్రైవర్ ఉద్యోగాలకు 10వ తరగతితో పాటు లైట్ మరియు హెవీ మోటార్ వాహనాలకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి, అలాగే పని అనుభవం కలిగి ఉండాలి.
వేతనం  : పే లెవల్-2 ప్రకారం రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం ఉంటుంది లేదా పే లెవల్-4లో రూ.25,500 నుంచి రూ.81,100 వరకు వేతనం ఉంటుంది.

వయసు : వయసు 18 నుంచి 25, 30 సంవత్సరాల మధ్య ఉండాలి. OBC (నాన్-క్రీమీ లేయర్) అభ్యర్థులకు సంబంధిత పోస్టుల్లో 3 సంవత్సరాల సడలింపు, SC అభ్యర్థులకు అర్హత ఉన్న పోస్టుల్లో 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఎలా చేయాలి : అభ్యర్థులు నోటిఫికేషన్‌లో ఇచ్చిన నిర్దేశిత దరఖాస్తు ఫార్మాట్‌ను ఉపయోగించి ఇంగ్లిష్ లేదా హిందీలో అప్లికేషన్ ఫిల్ అప్ చేయాలి.  దరఖాస్తుతో పాటు స్వీయ ధృవీకరణ చేసిన ఫోటో, విద్యార్హత సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, కేటగిరీ సర్టిఫికెట్, అనుభవ ధ్రువపత్రం వంటి అవసరమైన పత్రాల ప్రతులను జత చేయాలి. అదనంగా, అభ్యర్థి పేరు మరియు చిరునామాతో రూ.50 పోస్టల్ స్టాంప్ అతికించిన ఖాళీ కవర్ కూడా దరఖాస్తుతో పంపాలి.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా

Headquarters, Coast Guard Region (West),
Alexander Graham Bell Road,
PO Malabar Hill, Mumbai – 400006.

ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురించిన తేదీ నుంచి 45 రోజుల్లోపు దరఖాస్తు సంబంధిత కార్యాలయానికి చేరాలి. ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న చివరి తేదీ 03 నవంబర్ 2026.

ఎంపిక విధానం : పంపించిన అప్లికేషన్లు షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తారు.

దరఖాస్తు చివరి తేదీ: 03 నవంబర్ 2026.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *